గుజరాత్‌లో రాహుల్ ప్రయత్నాలు ఫలింద దక్కేనా?

కాంగ్రెస్‌లో పనిచేస్తున్న బీజేపీ ఏజెంట్లను బహిష్కరించాలన్న రాహుల్ వ్యాఖ్యలు పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికను దెబ్బతీసే అవకాశం ఉందని ఏఐసీసీ నాయకుడొకరు అన్నారు.;

Update: 2025-04-29 14:27 GMT

గత మూడు దశాబ్దాలుగా గుజరాత్‌(Gujarat)లో కాంగ్రెస్ ఊసే లేదు. హస్తం పార్టీ (Congress)అక్కడ పూర్తిగా బలహీనపడిపోయింది. పార్టీ పునరుజ్జీవానికి కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'పైలట్ ప్రాజెక్ట్'తో ముందుకొచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసి, వారికి అధికారం ఇవ్వడం ద్వారా నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నది ఆయన ఆలోచన.

ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కై పనిచేస్తున్న వారు పార్టీకి అవసరం లేదని రాహుల్ గాంధీ ఘాటుగానే హెచ్చరించారు. దీంతో ఈ ప్రాజెక్టు అమలుతో సంబంధం ఉన్న నాయకులు తమ అంతర్గత ప్రత్యర్థులకు, డీసీసీ చీఫ్ పదవికి కాబోయే అభ్యర్థులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ వారి ఎదుగుదలకు అడ్డుతగులుతున్నారు.

ఆ జిల్లాలపైనే గురి..

ఓబీసీల ఆధిపత్యం బాగా ఉన్న ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలు. పోర్‌బందర్‌ జిల్లాలో అగ్రవర్ణ దర్బార్ కమ్యూనిటీకి చెందిన నాయకుడొకరు డీసీసీ చీఫ్ పదవికి పోటీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాలో వెనుకబడిన వర్గం మెహర్ కమ్యూనిటీకి మంచి సంఖ్యాబలముంది. సుమారు 20 ఏళ్ల క్రితం, గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వంలో అర్జున్ మోధ్వాడియా ఎదుగుదలకు ఈ కమ్యూనిటీ మద్దతుగా నిలిచింది. ఆయన గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. అయితే గత మార్చిలో అనూహ్యంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో సౌరాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ మెహర్ వర్గానికి చెందిన అత్యంత ప్రముఖ నాయకుడిని కోల్పోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ (సంఘటన నిర్మాణ కార్యక్రమం) కార్యక్రమలో భాగంగా.. జిల్లా కమిటీల పునర్నిర్మాణాన్ని ప్రారంభించడంతో పోరబందర్‌లో తిరిగి మెహర్ వర్గంపై దృష్టి సారించే అవకాశముంది. అయితే వారు దర్బార్ వర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడి కింద పనిచేయాల్సి వస్తుందేమోననే అనుమానంతో అసంతృప్తిగా ఉన్నట్లు ఒక నాయకుడు చెప్పారు.

ఉత్తర గుజరాత్‌ బనస్కాంత జిల్లాలో బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వెనుకబడిన వర్గానికి అంజన పటేల్ వర్గానికి చెందిన మావ్జీ చౌదరి పేరు డీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చౌదరి బనస్కాంత జిల్లాకు చెందినవాడు కాదు. పార్టీ తనను డీసీసీ చీఫ్‌గా నియమించాలనుకుంటే అంజనా పటేల్‌ వర్గం అధికంగా ఉన్న పొరుగు జిల్లా పటాన్‌ తనకు కేటాయించాలని ఆయన ది ఫెడరల్‌తో అన్నారు.

సీనియర్ల మాటలను పెడచెవినపెట్టడం వల్లే..

"గత రెండేళ్లలో..75 మంది జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీని విడిచిపెట్టారు. సీనియర్ల మాటకు విలువ ఇవ్వడం లేదని చాలా మంది అనుభవజ్ఞులు ఇంట్లోనే కూర్చున్నారు. పార్టీకి వారు చాలా కీలకం," అని గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్హర్ పటేల్ ది ఫెడరల్‌తో అన్నారు.

‘‘పాల సహకార సంఘాల నాయకుడు నాతు ఠాకూర్‌తో గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వం ఎలా వ్యవహరించిందో పటేల్ చెప్పుకొచ్చారు. 2017, 2019 మధ్య సహకార సంఘాల ఎన్నికలను కాషాయ పార్టీ నిలిపివేయడానికి వ్యతిరేకంగా గుజరాత్ కాంగ్రెస్ జోక్యం చేసుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దాంతో ఆయన 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు’’ అని పటేల్ పేర్కొన్నారు.

"ఈసారి భారీ స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతోందని, పనితీరులో మార్పు వస్తోందన్న నమ్మకం స్థానిక నాయకుల్లో లేదు. ముందు వారిలో మార్పు తీసుకురావాలి’’ అని ఒప్పించాల్సి ఉంటుంది" అని గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి పేర్కొన్నరాు. ప్రతి జిల్లాకు కేటాయించిన AICC పరిశీలకులు బూత్ ఏజెంట్లు, బూత్ అధ్యక్షులు, బ్లాక్ స్థాయి ఆఫీస్ బేరర్లతో మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ముందున్న సవాళ్లు..

మే 10 నాటికి కొత్త జిల్లాల అధ్యక్షులను ఖరారు చేయగలుగుతారా? ఈ పునర్నిర్మాణం వాస్తవికంగా కాంగ్రెస్ పునరుద్ధరణకు దోహదపడుతుందా? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో ఐక్యత సాధ్యమవుతుందా? 

Tags:    

Similar News