రాయ్‌బరేలిలో రాహుల్, యూపీ మంత్రికి మధ్య వివాదమేంటి?
సమావేశంలో మాట్లాడే ముందు అనుమతి తీసుకోవాలన్న లోక్‌సభా ప్రతిపక్ష నేతకు ప్రతాప్ సింగ్ ఇచ్చిన కౌంటర్ ఏమిటి?;
ఉత్తర ప్రదేశ్(Utter Pradesh) రాష్ట్రం రాయ్‌బరేలి(Raebareli)లో జరిగిన సమీక్షా సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ (Dinesh Pratap Singh) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.
ఇంతకూ ఏం జరిగిదంటే..
రాహుల్ తన నియోజకవర్గం రాయ్‌బరేలీ పర్యటనలో భాగంగా జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ (Disha) సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో దినేశ్, అమేఠీ ఎంపీ కేఎల్ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాహుల్.. ‘మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా అడగండి. ఆ తర్వాత నేను మీకు మాట్లాడే అవకాశం ఇస్తా’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై దినేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లోక్‌సభ స్పీకర్ మాటే వినరు మీరు.. మీ మాటలను నేను ఎలా వింటాను’ అని దినేశ్ వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ నేపథ్యంలో సమావేశానికి హాజరైన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.