ఎప్పుడూ లేనిది ఔరంగజేబు పేరు గట్టిగా ఎందుకు వినిపిస్తోంది?

బీజేపీ మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రాధాన్యం ఇస్తోందా?;

Update: 2025-03-19 12:44 GMT

సంకేత్ ఉపాధ్యాయ

మొగల్ పాలకుడు ఔరంగజేబు సమాధి తొలగింపు విషయం మహారాష్ట్రలో ఇప్పుడు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. అలాగే మొగల్ పాలకుల పాలనపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడే మతోన్మాది ఔరంగజేబు పేరు తెర పైకి ఎందుకు వచ్చింది? దీనిపై అనేక విశ్లేషణలు ఉన్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలపై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఔరంగజేబు సమాధి విషయం హైలైట్ అయింది. నిజానికి ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని పరిమితుల దృష్ట్యా కొన్ని సంక్షేమ పథకాలను నిలిపివేసింది.
పొలిటికల్ టర్న్ తీసుకున్న వివాదం..
ఈ వివాదానికి మొదట ఆజ్యం పోసింది మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ. ఆయనను ఔరంగజేబును సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడంతో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి విరుచుకుపడింది.
Full View

‘‘ఔరంగజేబు అనేక దేవాలయాలు నిర్మించాడు. మీరు వారణాసికి వెళ్లండి అక్కడ పూజారులు ఆయన పేరుతో గుడి నిర్మించారు’’ అని వ్యాఖ్యలు చేశారు. దీనితో శివసేన, బీజేపీ నేతలు, నాయకులు వరుస పెట్టి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరో అడుగుముందుకేసి ‘‘ అతడిని(అబూ ఆజ్మీ) యూపీ పంపండి. మేము అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాం’’ అన్నారు. ఇక్కడ ఎస్పీ పార్టీ ప్రతిపక్షంగా ఉంది.
ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలి
బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోంస్లే మాట్లాడుతూ.. ఔరంగజేబు సమాధిని కూల్చి వేయాలని డిమాండ్ చేశాడు. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశానికి చెందినవాడు.
దీనితో వివాదం మరింత ముదిరింది. కానీ కాంగ్రెస్ పార్టీ కాలంలో దీనిని ఈ సమాధిని వారసత్వ కట్టడంగా మార్చి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కిందగా మార్చారని అన్నారు.
మహారాష్ట్ర సీఎం భోంస్లే వ్యాఖ్యలను సమర్థించారు. ఇవి బీజేపీ- కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు శివాజీ మహారాజ్ చరిత్ర ఒక భావోద్వేగ విషయం. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అధికార పార్టీ రాజకీయాలను సరిగా తిప్పికొట్టలేకపోతున్నాయి.
డైవర్షన్ పాలిటిక్స్
ప్రస్తుతం మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ధ్వంసం చేయాలనే డిమాండ్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చర్చనీయాంశంగా ఉంది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం వారి ఎన్నికల వాగ్థానాలను నేరవేర్చడానికి ఇప్పుడు కష్టతరంగా కనిపిస్తోంది.
బీజేపీ, శివసేన, అజిత్ పవార్ వర్గాలు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కారణమైన హమీలకు బడ్జెట్ లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో మెల్లగా చర్చ ప్రారంభం అయింది.
అన్ని వార్తా పత్రికలు రాష్ట్ర బడ్జెట్ అంశాన్ని పతాక శీర్షికలకు ఎక్కించాయి. సంక్షేమానికి నిధులు లేవు అనే హెడ్డింగ్ లు పెట్టేశాయి. దీనితో ప్రభుత్వానికి మైలేజ్ కి తగ్గిపోవడం ప్రారంభం అయింది.
లాడ్కీ బహిన్ యోజన..
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అతిపెద్ద వాగ్థానం మహిళలకు ప్రతినెలా డబ్బులు ఇస్తామని పేర్కొంది. లాడ్కీ బహిన్ యోజన కింద ప్రతి నెల ఇప్పుడు ఇస్తున్న రూ. 15వందల మొత్తాన్ని రూ. 2100కు పెంచుతామని ప్రకటించింది.
అయితే ఇప్పటి వరకూ ఎవరికి ఆ మొత్తం అందలేదు. అయితే ఐదు లక్షల మంది మహిళలను అర్హత జాబితా నుంచి తొలగించారు. అధికారులు సైతం పెంపుదల గురించి ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు.
రుణమాఫీ విషయంలో..
మరో కీలకమైన ఎన్నికల హమీ అయిన రుణమాఫీని సైతం ప్రభుత్వం అమలు చేయకుండా పోయింది. ప్రధాని నరేంద్ర మోదీ రెవ్డీ( ఓట్ల కోసం ఉచితాలు) సంస్కృతిని విమర్శించారు. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ దీనిని ఎన్నికల వ్యూహంగా ఉపయోగించుకుంది. ప్రత్యక్ష నగదు ప్రయోజనాలకు హమీ ఇచ్చింది.
నాయకులు తప్పించుకున్నారు..
ఎన్నికలకు ముందు నగదు చెల్లింపులు ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యూఎస్ లో జరిగిన అధ్యయనంలో ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీకి అధిక మద్దతు ఇవ్వడానికి కారణం ప్రత్యక్ష నగదు బదిలీలే అని తేలింది.
అలాగే హోండురాస్ లో జరిపిన ఒక సర్వేలో దీర్ఘకాలిక సంక్షేమ పథకాల కంటే నగదు పంపిణీ ఎక్కువగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ సరిగ్గా ఇదే విధంగా వాగ్థానాలుచేసింది.
తరువాత ఏంటీ?
బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వ ఆర్థిక పరిమితులను బహిర్గతం చేస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షం విమర్శలు చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. ఇంతలో ఔరంగజేబు చర్చ రాజకీయాలలో బుల్డోజర్ లా దూసుకొచ్చింది. ప్రజల దృష్టి మొత్తం ఇప్పడు ఛత్రపతి వంశం, మొఘల్ పాలకుల విషయాల మీదికి మళ్లింది.


Tags:    

Similar News