బీజేపీ కూడా మహారాష్ట్ర విజయాన్ని ఊహించలేదు: ఉద్దవ్ ఠాక్రే
కాంగ్రెస్ వ్యాఖ్యలను సమర్థించిన యూబీటీ చీఫ్;
By : Praveen Chepyala
Update: 2025-02-08 07:37 GMT
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే రాహుల్ గాంధీ వాదలను శివసేన ( యూబీటీ) చీప్ ఉద్దవ్ ఠాక్రే సమర్ధించారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూడా ఈ విజయాన్ని నమ్మలేదని అన్నారు.
ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గాంధీ మెజారిటీ ప్రహసనాన్ని బద్దలు కొట్టారని ఆయన అన్నారు. ప్రతిపక్షం తన ఓటమి నిజమైనదని నమ్మలేకపోతున్నట్లే, భారతీయ జనతా పార్టీ కూడా తన విజయాన్ని నమ్మదగినదిగా భావించలేదని ఠాక్రే అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికలలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంతకుముందు రోజు మాట్లాడుతూ.. రాష్ట్ర వయోజన జనాభా కంటే ఎక్కువ మంది నమోదిత ఓటర్లు ఉన్నారని, లోక్ సభ , రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య దాదాపు 39 లక్షల మంది ఓటర్లు అదనంగా చేర్చబడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంతకుముందు ఐదు సంవత్సరాలలో దాదాపుగా 32 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదవగా, ఐదు నెలల కాలంలో ఇన్ని లక్షల మంది ఎలా వచ్చారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన పూర్తి డేటా ఎన్నికల సంఘం ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు.