ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులకు మమత అభయం

2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా చేపట్టిన ఉద్యోగాల నియామకాలు చెల్లవన్న కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.;

Update: 2025-04-07 10:30 GMT

ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) హామీ ఇచ్చారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బాధిత అభ్యర్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు కూడా మమతా వెంట ఉన్నారు. ‘‘ఇతరులు ఏమనుకుంటారన్నది నాకు అనవసరం. అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి నేను అండగా ఉంటా’’ అని భరోసా ఇచ్చారు.

బీజేపీ నిరసన ప్రదర్శన..

సరిగ్గా ఇదే సమయంలో ప్రతిపక్ష బీజేపీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి కాళీఘాట్ నివాసానికి చేరుకోవాని కోరింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష (BJP) నేత సువేందు అధికారి (Suvendu Adhikari) మాట్లాడుతూ.."ఆమె ముఖ్యమంత్రి కాదు, టీఎంసీ నాయకురాలు మాత్రమే. ఆమె నిజంగా సీఎం అయితే ఆమె ఎంపిక చేసిన కొద్దిమందిని కాదు, అందరు ఉపాధ్యాయులను కలిసి ఉండేది,’’ అని విమర్శించారు. ఇటు ఇతర బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో "మమతా చోర్ (దొంగ)" అంటూ పోస్టర్లను ప్రదర్శించారు.

ఇంతకు కేసేమిటి?

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలను చేపట్టింది. నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’ కుంభకోణంపై కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. OMR షీట్లను తారుమారు చేశారని, ర్యాంకింగ్‌లను తారుమారు చేశారని దర్యాప్తులో తేలింది.

నియామకాలను రద్దు చేయాలని ఆదేశిస్తూ 2024 ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పును సమర్థించింది

Tags:    

Similar News