మన సాంప్రదాయంలోనే అలా జీవించడం ఉంది: అమర్త్య్ సేన్

హిందూవులు వందల సంవత్సరాలుగా ఇతరులతో కలిసి జీవిస్తున్నారని, ఇదే మన సాంప్రదాయమని నోబెల్ గ్రహీత అమర్త్య్ సేన్ అన్నారు.

Update: 2024-07-14 07:17 GMT

చారిత్రాత్మకంగా భారత్ లో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ప్రస్తుత కాలంలో కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. నిరుపేద యువతలో పుస్తక పఠన అలవాట్లను పెంపొందించేందుకు శనివారం (జూలై 13) అలీపూర్ జైలు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రసంగించారు.

“మన దేశ చరిత్రను పరిశీలిస్తే, హిందువులు - ముస్లింలు యుగయుగాలుగా సంపూర్ణ సమన్వయంతో సామరస్యంతో కలిసి పనిచేస్తున్నారు. ఇది క్షితిమోహన్ సేన్ తన పుస్తకంలో ప్రస్తావించిన 'జుక్తోసాధన' లాగే ఉందన్నారు. మన ప్రస్తుత కాలంలో 'జుక్తోసాధన' అనే ఈ ఆలోచన విధానాన్ని కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన రిలీజియన్ టాలరెన్స్ పై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు.
'మత సహనం ఒక్కటే కాదు'
కేవలం మన సమాజం మాత్రమే జీవించడం కాదు. మనం ఇతరులతో కలిసి జీవించడంలోనే ఉన్నతి ఉందని, వేరే వ్యక్తులపై దాడి చేయడం కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమని విశదీకరించారు. తన ఉదారవాద దృక్పథాలతో ప్రసిద్ధి చెందిన సేన్, పిల్లల మధ్య ఎటువంటి విద్వేష విభజన ఉండకూడదని సూచించారు.
సమాజంలో సహనం విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్వేషపూరిత విద్యను పుస్తకాల నుంచి తొలగించాలని అన్నారు. అలాంటి సమయంలోనే వారంతా స్నేహితులుగా మారతారని అభిప్రాయపడ్డారు. మనసులు నిష్కల్మషంగా ఉండాలని అన్నారు. మతం ఆధారంగా వివక్ష చూపని రంగాల ద్వారా రాజకీయాలు, సామాజిక సేవ, కళలు కొనసాగాలని అన్నారు.
“మీరు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌ల మధ్య వారి మతపరమైన గుర్తింపులను వేరు చేయగలరా? వారి స్వంత శాస్త్రీయ సంగీత శైలి కోసం వారు విభిన్నంగా ఉంటారు, ”అని సేన్ చెప్పారు.
చరిత్ర నుంచి పాఠాలు
మన దేశంలో ఆది నుంచి మత సామరస్యం ఉందని, భిన్నత్వంలో ఏకత్వం ఎప్పుడు ఉందని కొన్ని ఉదాహారణలు చరిత్ర నుంచి వివరించే ప్రయత్నం చేశారు. ఉపనిషత్తులను సంస్కృతం నుంచి పార్శీ భాషలోకి అనువదించిన ముంతాజ్ కుమారుడు దారాషికో ను గుర్తు చేశాడు.( దారాషికో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు, ఉపనిషత్తులను పార్శీ లోకి అనువదించిన సందర్భాన్ని మతోన్మాది ఔరంగజేబు ఆసరాగా తీసుకుని, ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని దారాషుకో పైకి యుద్దానికి వెళ్లి హత్య చేశాడు)
“అతను హిందూ గ్రంథాలు, సంస్కృత భాషలో బాగా ప్రావీణ్యం సంపాదించాడని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మన అహంకారం, తాజ్ మహల్‌ ఇలా రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి, ఇది అద్భుతమైన నిర్మాణం ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం నిర్మించబడింది" అని సేన్ అన్నారు. "తాజ్ మహల్ చాలా అందంగా కనిపించడం, గొప్పతనాన్ని కలిగి ఉండడంపై కొందరు వ్యతిరేకిస్తున్నారు. స్మారక చిహ్నం పేరును ముస్లిం పాలకులతో సంబంధం లేకుండా మార్చాలని కోరుకునే మరొక పాఠశాల ఉంది" అని ఆయన చెబుతున్నారు.
Tags:    

Similar News