ట్రంప్ దెబ్బ.. భారతీయ మందుల దిగుమతులపై 100 శాతం సుంకం..

భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం..

Update: 2025-09-26 08:22 GMT
Click the Play button to listen to article

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గురువారం (సెప్టెంబర్ 25) మరో కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1 నుంచి భారత్ నుంచి దిగుమతి అయ్యే మందుల(Medicines)పై 100 శాతం సుంకం విధిస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో మరో విషయం కూడా చెప్పారు. అమెరికాలో తయారుచేసే కంపెనీలకు ఈ సుంకం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సెన్సస్ బ్యూరో ప్రకారం 2024లో భారత్ నుంచి దాదాపు USD 233 బిలియన్ల ఔషధాలను అమెరికా దిగుమతి చేసుకుంది.

"అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెండెడ్ ఫార్మా ఉత్పత్తులపై మేం100 శాతం సుంకాన్ని విధిస్తాం. అమెరికాలోనే తయారయ్యే ఉత్తత్తులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.


ఇండియన్ ఫార్మా కంపెనీలపై ప్రభావం..

భారత్ నుంచి అమెరికాకు జనరిక్ మందులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. దీంతో ట్రంప్ నిర్ణయం భారత్ ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉంది. 2024లో భారత్ నుంచి దాదాపు $8.73 బిలియన్ల విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి అయ్యాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో 30–50 శాతం ఆదాయం.. అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా సంపాదిస్తున్నాయి. దీంతో ఈ కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.


జనరిక్ మెడిసిన్ వాడకం ఎక్కువ..

అమెరికాలో ఉపయోగించే జనరిక్ మందుల్లో 45 శాతం అలాగే బయోసిమిలర్ మందుల్లో 15 శాతం భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ప్రిస్క్రిప్షన్ మార్కెట్‌లో జనరిక్స్ మందులదే హవా. అమెరికాలోని ప్రతి 10 ప్రిస్క్రిప్షన్‌లలో దాదాపు నాలుగు ప్రిస్క్రిప్షన్‌‌లలో రాసిన మందులు భారతీయ కంపెనీలు తయారుచేసినవే ఉండడం విశేషం. 

Tags:    

Similar News