‘చొరబాటుదారులను ప్రోత్సహించే ఆర్జేడీ, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి’
‘చొరబాటుదారులను ప్రోత్సహించే ఆర్జేడీ, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి’
బీహార్(Bihar)లోని ఆర్జేడీ(RJD)-కాంగ్రెస్(Congress) కూటమికి "చొరబాటుదారుల పట్ల సాఫ్ట్ కార్నర్" ఉందన్నారు ప్రధాని మోదీ (PM Modi). అదే సమయంలో వారికి" రాముడు, ఛతీ మైయా పట్ల అయిష్టత" ఉందని కూడా పేర్కొ్న్నారు. గురువారం (నవంబర్ 6) అరారియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు.
పదిహేనేళ్ల పాలనలో..
"15 ఏళ్ల చీకటి పాలనలో బీహార్ అభివృద్ధి శూన్యం. రహదారులు, వంతెనలు నిర్మించలేదు. ఉన్నత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి నితీష్ నాయకత్వంలోని NDA.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది," అని పేర్కొన్నారు.
"నేడు బీహార్‌కు చాలా ఎక్స్‌ప్రెస్‌వేలు వచ్చాయి. నదులపై వంతెనల నిర్మాణం జరిగింది. నాలుగు కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా కేంద్రాలు వచ్చాయి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే NDA కూటమితోనే సాధ్యం’’ అని చెప్పారు.
"దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టడానికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. కానీ కాంగ్రెస్-ఆర్జేడీ ద్వయం వారికి రక్షణ కల్పిస్తుంది. వారికి అనుకూలంగా రాజకీయ యాత్రలు నిర్వహిస్తుంది." అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటరు అధికార్ యాత్ర, "ఓటు దొంగతనం" ఆరోపణలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు.
"ఆర్జేడీ-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. చొరబాటుదారులకు ద్వారాలు తెరుస్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలే వారికి ముఖ్యం. కానీ ఇది ఈ దేశ ప్రజలపై చాలా ప్రభావం చూపుతుంది. భారత పౌరులకు చెందిన ప్రతిదానిలో చొరబాటుదారులు వాటా పొందుతున్నారు" అని పేర్కొన్నారు మోదీ.
“ఛతీ మైయాలో పాల్గొనడం ఒక నాటకంగా అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ నామ్‌దార్ (రాహుల్ గాంధీ). వారు రాముడి దర్శనం కోసం ఎప్పుడూ అయోధ్యకు వెళ్లరు. శ్రీరాముడి పట్ల వారికి ఉన్న అయిష్టతను నేను అర్థం చేసుకున్నాను.’’ అన్నారు.
‘‘కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. ఎన్నికల తర్వాత, కూటమి భాగస్వాములంతా ఒకరి తల ఒకరు పగలగొట్టడం మీరు చూస్తారు.’’ అని మోదీ వ్యాఖ్యానించారు.