KTR | సన్నకారు రైతులపైనే రేవంత్ జులుం.. మండిపడ్డ కేటీఆర్

సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డే అంటూ బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ చురకలంటించారు.

Update: 2024-11-25 09:40 GMT

మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ మహాధర్నా(BRS Maha Dharna) చేపట్టింది. ఇందులో పాల్గొన్న కేటీఆర్(KTR).. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ 28సార్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ తెలంగాణకు రూ.28 రూపాయలు కూడా తీసుకురాలేదంటూ చురకలంటించారు. పదే పదే ఢిల్లీకి వెళ్లి తెలంగాణ ప్రజల ధనాన్ని వృధా చేయడం తప్ప ఈ పర్యటనలతో వచ్చిందేముంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్లడానికి కూడా రేవంత్ పయనమవ్వడానికి సన్నాహమవుతున్నారని, ఈసారైనా తెలంగాణకు ఏమైనా తెస్తారా? అని ప్రవ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదని, అన్ని వర్గాల ప్రజలకు కష్టాలే వచ్చాయంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలనకు లగచర్ల ఘటన నిలువెత్తు నిదర్శనమని అన్నారు కేటీఆర్. పచ్చని పొలాలను లాక్కుని దమ్మిడి ఆదాయం రాని ఫార్మా సిటీ నిర్మిస్తానని అన్నారని, దాన్ని ప్రజలు వ్యతిరేకించడంతో వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘చిన్న సన్నకారు రైతులపై రేవంత్ రెడ్డి జులం ప్రదర్శిస్తున్నారు. సొంత అల్లుడి కోసం లగచర్లలో పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో ఇప్పటి వరకు లాక్కున్న పేదల భూములను వెనక్కు ఇచ్చేయాలి. దాదాపు 3 వేల ఎకరాలను లాక్కోవాలని లగచర్లలో ప్రయత్నాలు చేశారు. తనకు ఓటేసి గెలిపించిన సొంత నియోజకవర్గ ప్రజలే సీఎం రేవంత్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే సీఎంకు తిరుగుబాటు ఎదురవుతోంది. రైతుల దెబ్బకు ప్రధాని మోదీనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం కూడా రైతులతో పెట్టుకున్నారు. రైతులను ఇబ్బంది పెట్టినవారు, రైతులతో పెట్టుకున్నవారు చరిత్రలో కలిపోయారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..

• జైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారు

• ఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు.

• ముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు.. అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారు.

• పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదు.

• ఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందా.

• రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారు.

నేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.

• అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు.

• మానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాం.

• కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారు.

• ప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుంది.

• నాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాం.

• ఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారు.

• గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు

• మానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు ఇస్తాము.

Tags:    

Similar News