రైతుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

రైతులకు నష్టపర్చే ప్రభుత్వం కాదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చెప్పారు. లగచర్ల ఘటనను తాము సీరియస్ గా తీసుకున్నామన్నారు.

Update: 2024-11-14 09:57 GMT

రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది తమ ప్ర‌భుత్వ ఉద్దేశం కాదని, వారి స‌మ‌స్య‌ల‌ను విని వాటిని ప‌రిష్క‌రించ‌డానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచిప‌ద్ద‌తి కాదని,ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు గానే ..రేపు రాజ‌కీయ నాయ‌కుల‌పై, ప్ర‌జ‌ల‌పై దాడులు జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దని మంత్రి చెప్పారు.


గులాబీ గుండాల దాడి
జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న‌క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అధికారుల మీద దాడి అనేది మ‌న‌మీద మ‌నం దాడి చేసుకున్న‌ట్లేనని చెప్పారు.రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుట్ర‌పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నారని,గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు.

మిర్చి రైతులకు సంకెళ్లు వేసింది మర్చిపోయారా?
‘‘బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారం వెల‌గ‌బెట్టిన‌నాడు ఇదే ప‌ద్ద‌తిలో చేశారా?ఏం త‌ప్పుచేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు’’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.‘‘మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించారని, పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా?ఎగిసి ఎగిసి ప‌డుతున్న కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా?’’ అని మంత్రి ప్రశ్నించారు.



Tags:    

Similar News