కులవివక్ష తొలగించి, అందరికి జాతి సంపద పంచుతాం : రాహుల్ గాంధీ
దేశంలో కులవివక్ష తొలగించి, అందరికీ జాతి సంపదను సమానంగా పంచేందుకు కృషి చేస్తామని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు.
ఏఐసీసీ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి కుల గణనపై ఏర్పాటైన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.‘‘టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు.కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాల్లో మునిగిపోయింది,ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలింది’’అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘టైటానిక్ పడవ లాగా నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉంది,దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది,మేం దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం.అందుకే కుల గణన అనేది అత్యంత కీలకం’’అని రాహుల్ చెప్పారు.