ముగిసిన మహాగణపతి నిమజ్జనం

ఐదు గంటలు సాగిన శోభాయాత్ర. గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి;

By :  Admin
Update: 2025-09-06 09:29 GMT

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా సాగింది. ఐదు గంటల శోభాయాత్ర అనంతరం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి నిమజ్జన ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో గణపతి ఉత్సవాలంటే గుర్తొచ్చే గణపతుల్లో ఖైరతాబాద్ గణపతి కూడా తప్పకుండా ఉంటాడు. ఆ గణపతి ఉత్సవాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి.

శోభాయాత్ర ఎలా సాగిందంటే..

మహాగణపతి శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాజ్‌దూత్‌ సర్కిల్‌, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మహాగణపతి చూసి గంగమ్మ దగ్గరకు సాగనంపడం కోసం వేలాది మంది భక్తులు శోభాయాత్ర మార్గానికి చేరుకున్నారు. భక్తుల జయజయ ధ్వనుల మధ్య మహాగణపతి గంగ ఒడికి చేరుకున్నాడు. 

Tags:    

Similar News