Singareni | సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం,భట్టి వెల్లడి

సింగరేణి సంస్థను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.తాము సింగరేణిని ప్రపంచంలోనే నేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామన్నారు.;

Update: 2025-01-05 07:32 GMT

సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. గత పాలకులు సింగరేణిని వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, కానీ తాము సింగరేణిని ప్రపంచంలోనే నేటి సంస్థగా నిలబెట్టాలనుకుంటున్నామని భట్టి ప్రకటించారు.

- సింగరేణి కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలకు పైగా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
- సింగరేణిలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్, పంపు స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని భట్టి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ పవర్ వైపు వెళుతున్న పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల బొగ్గుపై ఆధారపడే పరిస్థితి తగ్గి ఆ గనులు మూతపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
- ముందుచూపుతో సింగరేణిని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

సివిల్స్ అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం : సీఎం
ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడంతొపాటు ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వసతి కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.సివిల్స్ మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని,గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని సీఎం పేర్కొన్నారు.
సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశమన్నారు.బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారని,అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలన్నారు. సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టి,ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం వివరించారు. మార్చి 31 లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నామని సీఎం వెల్లడించారు.




Tags:    

Similar News