వరంగల్‌లో భావోద్వేగానికి లోనైన రేవంత్.. ఎందుకో తెలుసా..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం వరంగల్‌లో పర్యటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సర్కార్.. ప్రజా విజయోత్సవాలు చేపట్టింది.

Update: 2024-11-19 10:54 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం వరంగల్‌లో పర్యటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సర్కార్.. ప్రజా విజయోత్సవాలు చేపట్టింది. నవంబర్ 14 నుంచి జరుగుతున్న ఈ వేడుకలు నెవ్వర్ బిఫోర్ అన్న స్థాయిలో నిర్వహిస్తోంది ప్రభుత్వం. వీటిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కళోజీ కళా క్షేత్రాన్ని జాతికి అంకితమియ్యారు. ఈ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ ఈరోజు డిజిటల్ పద్దతిలో ప్రారంభించారు. అనంతరం దానిని జాతికి అంకితమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కళా క్షేత్ర ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉంది. అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రాధాన్యత పరంగా, అధిక సంక్షేమం అందించేలా ఈ పథకాల అమలును చేపడుతున్నాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగానే ప్రజాపాలన విజయోత్సవ సభను వరంగల్‌లో నిర్వహించాం. కాళోజీ సహా పీవీ వరకు ఎందరో మహానీయులు తీర్చిదిద్దిర గడ్డ వరంగల్ నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌కు జన్మనిచ్చిన గడ్డ ఇది’’ అని తెలిపారు.

‘‘హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మలు నడిచిన ప్రాంతమిది. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం ఈ వరంగల్ గడ్డ. వీరందరి స్ఫూర్తితో వరంగల్ దశ-దిశ మార్చడానికి ఈరోజు వరంగల్ వస్తున్నా. ఈరోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ హన్మకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాం. 2040 టార్గెట్‌గా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం’’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News