తెలంగాణలో మళ్ళీ పొంగనున్న బీర్లు
తెలంగాణ మందుబాబులకు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నిలిచిపోయిన బీర్ల సరఫరాను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది.;
తెలంగాణ మందుబాబులకు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నిలిచిపోయిన బీర్ల సరఫరాను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది. తమకు బకాయిలు చెల్లించడం లేదని, ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతించడం లేదని పేర్కొంటూ ఇటీవల తెలంగాణకు బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. ఎవరు ఎంత ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించినా తాము ధరలు పెంచడానికి అంగీచరించేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా గత ప్రభుత్వం వదిలిన బకాయిలను తమ ప్రభుత్వం మెల్లగా చెల్లిస్తుందని వెల్లడించింది. ఇంతలో ప్రభుత్వం చర్చలు జరపడానికి యూబీ సంస్థ సన్నద్ధమైంది. ఈ చర్చలు నడుస్తున్న క్రమంలో తెలంగాణకు బీర్ల సరఫరాను పునరుద్దరించాలని నిర్ణయించుకుంది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై సానుకూలంగా స్పందించింది.
వీటిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ క్రమంలోనే బీర్ల సరఫరాను పునరుద్దరించాలని నిర్ణయించుకున్నట్లు యూపీ ప్రకటించింది. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమలు చేయనున్నట్లు తీసుకురానున్నట్లు యూబీ తెలిపింది. అయితే ఈ నెల 8వ తేదీన బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యూబీ ప్రకటించింది.
యూబీ ఏం చెప్పిందంటే..
తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్‌కు బీర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ విషయాన్ని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. హెనికిన్, కింగ్ ఫిషర్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తుంది. తెలంగాణ నుంచి రూ.900 కోట్ల బకాయిలు ఉండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యూబీ వెల్లడించింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో యూబీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సెబీకి లేఖ ద్వారా వెల్లడించింది. నాలుగేళ్లుగా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఉత్పత్తులకు అందించే బేస్ ధరల్లో పెరుగుదల లేదని, ఇది నష్టాలకు దారి తీసిందని, తెలంగాణలో తమ కార్యకలాపాలు అసమర్థంగా మారడంతోనే తెలంగాణకు తమ బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిశ్చయించుకున్నట్లు యూబీ తన ప్రకటనలో తెలిపింది.
‘‘మా వాటాదారులందరికీ విశ్వసనీయ బాధ్యత ఉంది. ప్రతి బీర్ నష్టానికి విక్రయించడంతో మా కార్యకలాపాలను కొనసాగించడం భారంగా మారింది. అదనంగా టీజీబీసీఎల్‌కి చేసిన సరఫరాల కోసం అధికమొత్తంలో చెల్లించిరావాల్సి రావడం కష్టంగామారింది. అందుకే తెలంగాణకు బీర్ల సరఫరాను నిలిపివేస్తుంది’’అని ప్రకటన తెలిపింది. కాగా ఈ బీర్ల సరఫరా అంశాన్ని తక్షణమే పరిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.