హై అలెర్ట్‌లో ఫైర్ సిబ్బంది.. దీపావళినే కారణం..

దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది ఢాం..ఢాం.. అంటూ ధూం ధాంగా పేలే క్రాకర్లు. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ మాత్రం హైఅలర్ట్ అయ్యింది. ఎందుకంటే..

Update: 2024-10-31 07:18 GMT

దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది ఢాం..ఢాం.. అంటూ ధూం ధాంగా పేలే క్రాకర్లు. అదే సమయంలో దీపావళి అంటే ఈ మధ్య అగ్ని ప్రమాదాలు కూడా చాలా మామూలయ్యాయి. దీపావళి రోజు ఈ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎక్కడిక్కడ టపాసులు పేల్చడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే దీపావళి పండగ వేల తెలంగాణ అగ్నిమాపక సిబ్బంది హై అలర్ట్ అయింది. ఈ దీపావళి నాడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడం కోసం ఫైర్ సిబ్బంది సన్నద్ధమైంది. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది అగ్ని పాక శాఖ. ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజుల పాటు హైఅలెర్ట్‌గా ఉండాలి.

ఎక్కడిక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీపావళి కారణంగా సంభవించే అగ్నిమాపక ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా ఫైర్ స్టేషన్‌లో పనిచేసే అధికారులు సహా, స్టేషన్లలో ఉండే పురుషుల సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలకు కూడా ముందస్తు జాగ్రత్తలు తెలిపింది. ప్రతి ఒక్కరూ క్రాకర్లు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పూరి గుడిసెలు, మండే సామాగ్రి ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దని అగ్నిమాపక శాఖ ప్రజలను కోరుతోంది.

వెంటనే స్పందించాలి..

క్రాకర్లు కాల్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, ఫార్ట్ సర్క్యూట్‌లు అయినట్లు కానీ ఏదైనా ప్రమాదం జరిగిందని కానీ ఫోన్ వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించింది విపత్తు నిర్వహణ శాఖ. వాణిజ్య సంస్థలు, కంపెనీలతో సహా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఆకస్మికంగా సంభవించే ప్రమాదాలను కూడా ఎదుర్కోవడానికి రెడీ ఉండాలని ఆదేశించింది. ఈ సందర్భంగా దీపావళి వేళ తీసుకోవాల్సిన చర్యలపై సదరు శాఖ వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని కేంద్రాలకు పంపిణీ చేసింది అగ్నిమాపక శాఖ.

సర్వే ఆధారంగా ఏర్పాట్లు

స్థానిక అధికారులు హై రిస్క్ జోన్‌లను గుర్తించారని, ఈ సర్వే ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని TSDRFD అధికారి వెల్లడించారు. వీటిలో క్రాకర్ దుకాణాలు వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతించబడిన హబ్‌లను హైరిస్క్ జోన్‌ల లిస్ట్‌లో చేర్చారు అధికారులు. ఏదైనా అత్యవసర పరిస్థితుల ఏర్పడతే వెంటనే సహాయం అందించడం కోసం ఆ ప్రాంతాల్లో అగ్నిమాపక టెండర్‌ను ఉంచారు అధికారులు. పారిశ్రామిక హబ్‌లను రెండవ హైఅలర్ట్ రిస్క్ జోన్‌లుగా గుర్తించారు. అంతేకాకుండా గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటనలను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రకారం వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సందర్భంగా 6,500 తాత్కాలిక వ్యాపార లైసెన్స్‌లను వ్యాపార శాఖ జారీ చేసిందని అధికారులు వెల్లడించారు.

దీపావళి సందర్భంగా అగ్ని భద్రత కోసం చేయవలసినవి:

బహిరంగ ప్రదేశంలో నిర్వహించబడే దుకాణం నుండి పటాకులను కొనుగోలు చేయండి

లైసెన్స్ పొందిన విక్రేత నుండి క్రాకర్లను కొనుగోలు చేయండి

బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే క్రాకర్లను కాల్చండి

సమీపంలో ఒక బకెట్ నీరు, ఇసుక ఉంచండి

కాటన్ వస్త్రాలను ధరించడానికి ఇష్టపడండి, సింథటిక్ బట్టలు సులభంగా మంటలను అంటుకోగలవు

క్రాకర్లు పేల్చేటప్పుడు పెద్దలు ఎల్లప్పుడూ పిల్లలను పర్యవేక్షించాలి

ఫైర్ క్రాకర్లను సరిగ్గా పారవేయండి

Tags:    

Similar News