Transgenders| హైదరాబాద్ లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 44 మంది ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్‌లుగా నియమించారు.;

Update: 2024-12-05 13:09 GMT

ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు.గోషామహల్ మైదానంలో ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్‌లుగా నియమితులైన ట్రాన్స్‌జెండర్లతో పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడారు.

- గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగిన 800 మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్ జంప్ పోటీలతో కూడిన క్వాలిఫయర్స్‌లో 58 మంది పోటీదారుల నుంచి 44మందిని ఎంపిక చేశారు.
- సమాజంలో ట్రాన్స్‌జెండర్ల వర్గానికి గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవలో భాగంగా ఈ నియామకం జరిగింది.ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- 18-40 సంవత్సరాల వయస్సుతో కనీసం ఎస్ఎస్ సీ ఉత్తీర్ణులను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేశామని సీసీ సీవీ ఆనంద్ చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కీలక సమావేశాలు నిర్వహించి శారీరక దారుఢ్య పరీక్షల అనంతరం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.



 పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురండి : సీపీ

‘‘మీలో ప్రతి ఒక్కరూ మీ సంఘానికి ఆదర్శంగా ఉండాలి, రాష్ట్ర పోలీసు విభాగానికి మంచి పేరు తీసుకురావాలి." అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డీసీపీ సౌత్ వెస్ట్, హోంగార్డు కమాండెంట్, అదనపు డీసీపీ సీఏఆర్‌లతో ఏర్పడిన రిక్రూట్‌మెంట్ కమిటీ ఈ పరీక్షను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అధికారులు అనితా రామచంద్రన్‌, రవిగుప్తాతో పాటు పి.విశ్వప్రసాద్‌, అదనపు సీపీ (ట్రాఫిక్‌) ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించారు. గత వారం రోజులుగా చర్చల అనంతరం ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది


Tags:    

Similar News