MULUGU ENCOUNTER|చర్చనీయాంశంగా మారిన ములుగు ఎన్‌కౌంటర్‌

ములుగు ఎన్‌కౌంటర్‌ చర్చనీయాంశంగా మారింది. ఎన్‌కౌంటరులో మావోయిస్టులపై విష పదార్థాలు ప్రయోగించారని ప్రచారం సాగుతుండగా, దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.;

Update: 2024-12-03 13:31 GMT

ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు మల్లయ్య మృతదేహాన్ని గురువారం వరకూ మార్చూరీలో భద్రపర్చాలని హైకోర్టు ఏటూరునాగారం పోలీసులను ఆదేశించింది. మల్లయ్య మృతదేహం పోస్టుమార్టం రిపోర్టును అందజేయాలని హైకోర్టు కోరింది. మిగతా ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.


మావోయిస్టులపై విష పదార్థాలు ప్రయోగించలేదు : డీజీపీ జితేందర్ వివరణ
ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటరులో మావోయిస్టులపై విష పదార్థాలు ప్రయోగించారనేది దుష్ప్రచారం అని తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఎదురుకాల్పులకు ముందు ఇన్ ఫార్మర్లు నెపంతో ఇద్దరు ఆదివాసీలైన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను మావోయిస్టులు కత్తులతో పొడిచి చంపారని డీజీపీ పేర్కొన్నారు. మావోయిస్టుల ఘటనలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు.

ఎదురుకాల్పుల ఘటనపై డీఎస్పీ దర్యాప్తు
మావోయిస్టులు అత్యాధునికమైన ఆయుధాలను ఉపయోగించి పోలీసులపై కాల్పులు జరిపారని డీజీపీ జితేందర్ చెప్పారు. దీని ఫలితంగా పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు సాయుధ మావోయిస్టులు మరణించారని డీజీపీ వివరించారు. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని, మావోయిస్టుల శవ పరీక్షలు హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల ప్రకారం జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల కేసు దర్యాప్తు బాధ్యతను వేరే జిల్లా డీఎస్పీని నియమించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ జితేందర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


Tags:    

Similar News