TGRTC | మానవతావాదులు ఈ ఆర్టీసీ ఉద్యోగులు, ఏం చేశారంటే...
ఆర్టీసీ బస్సులోనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు.బస్సు స్టేషనులో ఉన్న ఓ మహిళకు గుండెపోటు రావడంతో అక్కడ ఉన్న డీఎం సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.;
ఆపదల్లో ఉన్న ప్రయాణికులకు సహాయం చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి బుధవారం సన్మానించారు. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఘనంగా సన్మానించింది.హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో డ్రైవర్ కోటేశ్వరరావు గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సత్కరించారు.
విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని #TGSRTC యాజమాన్యం ఘనంగా సన్మానించింది.
— Office of V.C. Sajjanar, IPS (@SajjanarOffice) February 5, 2025
హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో PHB డ్రైవర్ కోటేశ్వరరావు గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతలను సంస్థ ఎండీ… pic.twitter.com/eUhB3AADT0