హైకోర్టులో బీఆర్ఎస్‌కు ఊరట.. మహాధర్నాకు ఓకే

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. నల్లగొండ జిల్లాలో రైతు మహాధర్నా నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది.;

Update: 2025-01-22 13:34 GMT

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. నల్లగొండ జిల్లాలో రైతు మహాధర్నా నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది. దీంతో జనవరి 28న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో బీఆర్ఎస్ భారీగా రైతు మహాధర్నా నిర్వమించనుంది. ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు కూడా ప్రారంభించేశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా నిర్వహించుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నాలుగు గంటల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. ఈ మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరుకానున్నారు.

అయితే వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ విఫలమైందని, వాటిని తక్షణం అమలు చేసేలా డిమాండ్ చేస్తూ మహా రైతు ధర్నాను నిర్వహించనుంది బీఆర్ఎస్. వాస్తవానికి ఈ దర్నాను జనవరి 21న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో నిర్వహించాలని భావించారు. కానీ పోలీసులు మాత్రం పార్టీ సన్నాహాలు అన్నీ దాదాపు పూర్తయిన సమయంలో అనుమతికి నిరాకరించారు. అధిక రద్దీ ఉండే ప్రాంతం కావడంతోనే తాము అనుమతులు ఇవ్వలేకపోయామని, ఈసారి మరేదైన జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతంలో ధర్నా నిర్వహించుకునే పని అయితే అనుమతులు అందిస్తామంటూ పోలీసులు బదులిచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. తాము ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లంచ్‌మోహన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Tags:    

Similar News