9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Update: 2024-10-18 10:47 GMT

తెలంగాణలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా మరో 9 వర్సిటీలకు వైన్ ఛాన్స్‌లర్లను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వారి పేర్లను కూడా ప్రకటించింది. కాగా ఇంకా జేఎన్‌టీయూ కూకట్‌పల్లి, జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీసీలకు వీసీల నియామకాన్ని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

కొత్తగా నియమితులైన వీసీలు వీరే

1. పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌కు వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్

2. వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి

3. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్

4. శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్‌కు వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్

5.ప్రొ.నిత్యానందరావు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, హైదరాబాద్

6. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్

7. ప్రొ.యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌కు వైస్ ఛాన్సలర్‌

8. ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్‌కు వైస్ ఛాన్సలర్‌గా

9. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ రాజి రెడ్డి

Tags:    

Similar News