ఉగ్రవాద శిబిరాల ధ్వంసం,ఆపరేషన్ సింధూర్ విజయం

మాజీ బ్రిగేదియర్ పోగుల గణేశం;

Update: 2025-05-09 09:10 GMT
ఆర్మీ మాజీ బ్రిగేడియర్ పోగుల గణేశం

జమ్మూకశ్మీరులోని పహెల్ గామ్ లోపాకిస్థాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో భారతదేశ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం భారతదేశానికి శుభారంభాన్ని ఇచ్చిందని ఇండియన్ ఆర్మీ మాజీ బ్రిగేడియర్ పోగుల గణేశం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైనికాధికారిగా 35 ఏళ్ల పాటు విశిష్ఠ సేవలందించి పదవీ విరమణ చేసి స్వచ్ఛంద సేవలు చేస్తున్న గణేశం ‘ఫెడరల్ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


ఉగ్రవాదులను అణచివేయాలి
‘‘దేశంలో పహెల్ గాం లాంటి ఉగ్రదాడులు జరగకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మూలాలతో పెకిలించి వేయాలి. దేశంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నందున వారిని మట్టుబెట్టేందుకు చేపట్టి ఆపరేషన్ సింధూర్ మంచి కార్యక్రమం ’’అని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను సాంఘీకంగా, ఆర్థికంగా అణచివేయాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని పలు దేశాలు మన దేశానికి మద్ధతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల పీచమణచడంతో భారత సైన్యం చేసిన ఆపరేషన్ మంచి ఫలితాలను ఇచ్చిందని వంద మందికి పైగా ఉగ్రవాదులు హతం అయ్యారని మాజీ బ్రిగేడియర్ చెప్పారు.



 భారత ఆర్మీకి మాజీ బ్రిగేడియర్ అభినందనలు

రెండు మూడు నెలల్లో పాక్ ఉగ్రవాదులను సమూలంగా కూకటివేళ్లతో పెకిలించి వేయాలని ఆయన సూచించారు. ఉగ్రవాదులకు తెరవెనుక సహాయం అందిస్తున్న పాక్ స్రభుత్వ పెద్దలు, ఆర్మీ అధికారులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ సరిహద్దుల్లో జమ్మూ కశ్మీర్, అమృత్ సర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తదితర సరిహద్దు రాష్ట్రాలపై పాక్ ఆర్మీ దాడులకు తెగబడిందన్నారు. పాక్ దాడిని మన భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారని బ్రిగేడియర్ గణేశం చెప్పారు. పాక్ ఆర్మీ దాడులను తిప్పికొట్టి, వీరోచితంగా పోరాడిన భారత సైనికులను మాజీ బ్రిగేడియర్ అభినందించారు.



 పాక్ దాడులను తిప్పికొట్టారు...

సరిహద్దు ప్రాంతాలపై పాక్ సైనికులు దాడికి యత్నించగా మన సైనికులు వీరోచితంగా పోరాడి పాక్ దాడులను సమర్ధంగా తిప్పికొట్టారని మాజీ బ్రిగేడియర్ చెప్పారు.పౌరుల నివాసాలపై పాక్ దాడులు చేయడం దారుణమన్నారు. పాక్ కుయుక్తులను అంతర్జాతీయ సమాజం చూస్తుందని చెప్పారు. ఇండియన్ ఆర్మీకే కాకుండా వారి కుటుంబాలకు మనం సంఘీభావం తెలపాలని ఆయన సూచించారు. పాక్ దుశ్చర్యలను ఎదుర్కొంటున్న మన సైన్యానికి పౌరులంతా అండదండలందించాలని కోరారు.

షంఘటితంగా ఉండాలి
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే కాకుండా పాక్ ఆర్మీ బలగాల కవ్వింపు చర్యలు, వారి దాడులను మన భారతీయులంతా కలిసి కట్టుగా ఉండి తిప్పికొట్టాలని మాజీ బ్రిగేడియర్ సూచించారు. దేశంలోని అందరూ సంఘటితంగా ఉండి విదేశీ శక్తుల ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ దేశంపై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నసమయంలో భారత పౌరులందరూ కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి సంఘీభావంగా నిలవాలని కోరారు. పాక్ తో యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా ప్రజలంతా ప్రయాణాలు తగ్గించుకొని వనరులను పరిమితంగా వాడుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్ లో దేశం కోసం పోరాడేందుకు పౌరులంతా సిద్ధంగా ఉండాలని మాజీ బ్రిగేడియర్ పిలుపునిచ్చారు.

సైన్యంలో బ్రిగేడియరుగా 35 ఏళ్ల సేవలు
తెలంగాణలోని భూంపల్లి గ్రామానికి చెందిన బ్రిగేడియర్ గా పోగుల గణేశం భారత సైన్యంలో ఆర్మర్డ్ వెహికల్స్ నిపుణుడిగా 35 ఏళ్ల పాటు విశిష్ఠ సేవలందించారు. కాశ్మీరులో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల్లో గణేశం బెటాలియన్ కమాండరుగా ప్రాజెక్ట్ గుల్ మోహర్ లో పనిచేశారు. సైన్యం కోసం బహుళ పాత్ర ఆయుధ విండీని అభివృద్ధి చేసి పేటెంట్ తో భారత సైన్యంలో గుర్తింపు పొందారు. ఈయన విశిష్ఠ సేవా మొడల్ పొందారు. బ్రిగేడియర్ గా పదవీ విరమణ చేశాక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టరుగా, ఉమ్మడి ఏపీలో సైనిక్ బోర్డు, ఈసీహెచ్ఎస్ సలహా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. పల్లె సృజనను ఏర్పాటు చేసి, దీని ద్వారా గ్రామీణ శాస్త్రవేత్తలను వెలుగులోకి తీసుకువచ్చి స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు.


Tags:    

Similar News