23న బడ్జెట్ సమావేశాలు... బీఆర్ఎస్ లో మొదలైన టెన్షన్!

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి.

By :  Vanaja
Update: 2024-07-18 11:21 GMT

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 24 న శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. ఈ నెల 25 న రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

గతంలో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్ ఈసారి ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైతు రుణమాఫీకి సంబంధించి సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తోంది. రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగనుంది. అలాగే.. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపైనా చర్చ జరపనున్నారు. 6 గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన పైనా చర్చలు జరిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ లో టెన్షన్...

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఇటీవల ఆ పార్టీ నుంచి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ... త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవబోతుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంకోవైపు రేవంత్ టార్గెట్ కూడా బీఆర్ఎస్ ని ఖాళీ చేసి కాంగ్రెస్ లో కలుపుకోవడమే అన్నట్టుగా ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుంటున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 38 నుంచి 28కి పడిపోయింది. ఇంకొక మందిని 17 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుంటే గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. అలాగే 2/3 సభ్యులు కాంగ్రెస్ లో చేరితే విలీనం కూడా అయినట్టే. దీంతో మందిని కాంగ్రెస్ లాగేసుకుంటుందా? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుందా? బీఆర్ఎస్ఎల్పీ సీఎల్పీ విలీనం అవుతుందా? అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. దీంతో అందరి ద్రుష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. 

Tags:    

Similar News