తెలంగాణలో ఎంతమంది నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి?

తెలంగాణ లోక్ సభ ఎన్నికలకి 1488 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని ఆమోదం పొందాయో అనే ఉత్కంఠకి తెరపడింది.

By :  Vanaja
Update: 2024-04-29 06:57 GMT

తెలంగాణలో ఏప్రిల్ 25 తో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 1488 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని ఆమోదం పొందాయో అనే ఉత్కంఠకి తెరపడింది. ఈసీ అధికారిక వెబ్సైట్ లో ఆ వివరాలను వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 1488 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపింది. వీటిలో 1060 నామినేషన్లు ఆమోదించగా, 428 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.

అయితే, మొత్తం 893 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లలో.. స్వయంగా అభ్యర్థులు, వారి సపోర్టర్లు అదనంగా వేసిన 268 నామినేష్లలు రిజెక్ట్ అయ్యాయి. స్క్రూటినీటి తర్వాత 625 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అత్యధికంగా 177 నామినేషన్ పత్రాలు సమర్పించగా.. వీటిలో 115 నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో, కేవలం 62 మాత్రమే ఆమోదించబడ్డాయి. అలాగే పత్రాలను దాఖలు చేసిన 114 మందిలో 77 మంది రిజెక్ట్ అయ్యి.. అత్యధికంగా తిరస్కరించబడిన వారి సంఖ్యలోనూ మల్కాజిగిరి టాప్ లో నిలిచింది. ఈ నియోజకవర్గం నుండి 37 మంది బరిలో ఉండనున్నారు.

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 53 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, భువనగిరిలో 51 మంది ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 13 మంది అభ్యర్థులు, నాగర్‌కర్నూల్ నుంచి 21 మంది పోటీలో ఉండనున్నారు.

వరంగల్ 48 మంది, జహీరాబాద్ 26 మంది, కరీంనగర్ 33 మంది, సికింద్రాబాద్ 46 మంది, హైదరాబాద్ 38 మంది, మహబూబాబాద్ 25 మంది, ఖమ్మం 41 మంది, చేవెళ్ల 46 మంది, నిజామాబాద్ 32 మంది, మహబూబ్ నగర్ 35 మంది, నల్గొండ నుంచి 31 మంది పోటీలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.

Tags:    

Similar News