తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15,16 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

By :  Vanaja
Update: 2024-08-22 13:01 GMT

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15,16 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్-2 వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో ప్రారంభం కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కాగా, జులైలో గ్రూప్ 2 పరీక్షలు పోస్టుపోన్ చేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. డీఎస్సీ పరీక్షలకి, గ్రూప్ 2 పరీక్షలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేనందున, ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదని, అందుకే పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాదాపు రెండు వారాలకు పైగా నిరసనలు వ్యక్తం చేశారు. వివాదం ముదురుతోన్న క్రమంలో ప్రభుత్వం దిగొచ్చింది. సచివాలయంలో గ్రూప్స్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరగా అందుకు సీఎం అంగీకరించారు. సర్వీస్ కమిషన్ తో చర్చలు జరిపి డిసెంబరులో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ క్రమంలో గురువారం పరీక్షల తేదీలు ఖరారు చేస్తూ టీజీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్టు తెలిపింది.

తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్:తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1

డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2

డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3

డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4

ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ డిసెంబరు 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి. పేపర్-2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించబడతాయి. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌తో కూడిన పేపర్-3డిసెంబర్ 16, 2024న ఉదయం 10 నుండి 12.30 గంటల మధ్య, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో కూడిన పేపర్-4 అదే రోజు అంటే డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుండి 5.30 గంటల మధ్య జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News