మెట్రో ప్రాజెక్ట్‌కు తుదిమెరుగులు.. అలైన్‌మెంట్ కీలక మార్పులు..

మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.32,237 కోట్ల వ్యయంతో ఈ పనులను పూర్తి చేయాలని యోచిస్తోంది.

Update: 2024-09-29 13:09 GMT

మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ.32,237 కోట్ల వ్యయంతో ఈ పనులను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేశారు. వీటి డీపీఆర్‌లను కూడా అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. డీపీఆర్‌ల ఏర్పాటు దాదాపు తుది దశకు చేరుకున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.ఇటీవల ఈ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ఫీచర్స్, స్టేషన్‌లు మొదలైన వాటిని సీఎంకు వివరించారు అధికారులు. ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏియాకు సిద్ధం చేస్తున్నట్లు, ట్రాఫిక్ అధ్యయన నివేదిక రావాల్సి ఉందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మెట్రో అలైన్‌మెంట్‌లో పలు కీలక మార్పులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ పనులను ప్రారంభించనున్నామని, ఈ ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

9 కారిడార్లలో మెట్రో మెరుపులు

మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ ప్రాజెక్ట్‌లో భాగంగా విమానావ్రయం నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో ట్రాక్ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన్ చర్చలు జరిగాయి. వాటి తర్వాత మెట్రో రెండో దశ కారిడార్‌ల విస్త్రృత కాంటూర్‌లకు సీఎం ఆమోదం తెలిపారు. కారిడార్-4లో.. నాగోల్-ఆర్‌జఐఏ(ఎయిర్ పోర్ట్ కారిడార్) వరకు 36.6 కిలోమీటర్ల వరకు , కారిడార్-5లో రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలీస్వరకు 11.6 కిలోమీటర్ల వరకు, కారిడార్-6లో ఎంజీబీఎస్-చాం్దరాయన్‌గుట్ట వరకు (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కిలోమీటర్ల వరకు సాగనున్నాయి. కారిడార్-7లో మియాపూర్-పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల వరకు, కారిడార్-8లో ఎల్‌బీనగర్-హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు, కారిడార్-9(ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్)లో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల దారిని కవర్ చేస్తాయి.

మొత్తం 24 స్టేషన్లు

మెట్రో ప్రాజెక్ట్ రెండో దశలో ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయన్ గుట్ట, మైలార్దేవ్ పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్.హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ లైన్ వరుసగా నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రో లైన్లకు అనుసంధానించబడుతుంది. ఈ కారిడార్ మొత్తం 36.6 కి.మీ పొడవులో, 35 కి.మీ ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

అలైన్‌మెంట్‌లో మార్పులు

మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రెండో దశ మెట్రా కారిడార్‌లు కేంద్ర ప్రభుత్వ అనుమతలు కోసం డీపీఆర్‌లను సమర్పించడానికి ఇది చేసి తీరాలని వివరించారు. గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఆరాంఘర్, 44వ నెంబర్ నేషనల్ హైవేలోకి కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకునేలా ఫైనల్ చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగానే ఈ కొత్త రూట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఆరాంఘర్-బెంగళూరు హైవేపై ఉన్న కొత్త హైకోర్టు మీదుగా ఇది ప్రయాణిస్తుందని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ టన్న‌ల్‌లో మెట్రో ప్రయాణించనుంది.

Tags:    

Similar News