రైతులకి గుడ్ న్యూస్... రేపే ఖాతాల్లోకి డబ్బు జమ

తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించనుంది.

By :  Vanaja
Update: 2024-05-06 14:20 GMT

తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించనుంది. రైతులకు ప్రకటించిన పరిహారాన్ని రేపటి లోగా చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక జీవోని విడుదల చేసింది.

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో గత మార్చిలో 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వడగళ్ల వానలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా 15,814 ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయినట్లు వ్యవసాయశాఖ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎకరాకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు నష్టపరిహారం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఆర్ధిక సహాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ పర్మిషన్ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా నిధుల పంపిణీకి సర్కార్ ఆదేశాలిచ్చింది.

జిల్లాల వారీగా పంటనష్టం వివరాలు...

అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 9,107 మంది రైతులు 10,328.04 ఎకరాల్లో పంట నష్టపోయారు. నిజామాబాద్ 1,809 మంది రైతులకు 1,652.25 ఎకరాల పంట నష్టం. రాజన్న సిరిసిల్ల 1,036 మంది రైతులు 1,014.06 ఎకరాల పంట నష్టం, సిద్దిపేట 793 మంది రైతులు 746.30 ఎకరాల పంట నష్టం, మెదక్ 957 మంది రైతులు 714.17 ఎకరాల పంట నష్టం, ఆదిలాబాద్ 370 మంది రైతులు 545.09 ఎకరాల పంట నష్టం, నిర్మల్ 519 మంది రైతులు 332.17 ఎకరాల పంట నష్టం, మంచిర్యాల 376 మంది రైతులు 244.01 ఎకరాల పంట నష్టం, కరీంనగర్ 160 మంది రైతులు 160.10 ఎకరాల పంట నష్టం, సంగారెడ్డిలో 119 మంది రైతులు 76.04 ఎకరాల్లో పంట నష్టపోయారు.

Tags:    

Similar News