Telangana| ధరణి పెండింగ్ దరఖాస్తు ల పరిష్కారానికి సర్కారు చర్యలు
తెలంగాణలో ధరణి పెండింగు దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరణి కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశాలు.
By : Shaik Saleem
Update: 2024-11-28 13:26 GMT
తెలంగాణ రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారానికి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీసీఎల్ఏ సర్కులర్ జారీ చేశారు.
ధరణి కమిటీ సూచనలు అమలుకు ఆదేశాలు
తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ చేసిన సిఫార్సుల మేర ధరణి ఫిర్యాదులను పరిష్కరించాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లు ముటేషన్, కోర్టు కేసులు, నాలా కన్వర్షన్, పాస్ బుక్ డేటా కరెక్షన్, పేరు మార్పులు చేయాలని సీసీఎల్ఏ ఆదేశాల్లో పేర్కొన్నారు.
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు అసైన్డ్ భూముల దరఖాస్తులు, నాలా పెండింగ్ దరఖాస్తులు, సర్వే నంబర్లలో డిజిటల్ సంతకాలు చేయాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నవీన్ మిట్టల్ జారీ చేసిన ఆదేశాల్లో కోరారు.