అవయవదానంలో తెలంగాణ ఫస్ట్, బెస్ట్ స్టేట్ అవార్డు ఎలా వచ్చిందంటే...

దేశంలోనే అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవార్డును తెలంగాణ అందుకుంది. ఈ ఘనత ఎలా సాధించిందంటే...

Update: 2024-08-03 14:13 GMT

14వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా శనివారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బెస్ట్ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ స్టేట్ ఆర్గాన్ అవార్డు ఇచ్చింది.

- తెలంగాణకు బెస్ట్ ఆర్గాన్ అవార్డును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ , నీతిఆయోగ్ హెల్త్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ లు శనివారం ప్రదానం చేశారు.తెలంగాణలో ‘జీవన్‌దాన్’పథకం కింద 5,541 మందికి అవయవదానం చేసి జీవం పోశారు.
- అవయవ దానం మహాదానం...బ్రెయిన్ డెత్ అయిన ఒక్కరు మరో 8 మందికి బతికించవచ్చు అని వైద్యులు చెప్పటంతో పలువురు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

అవయవ దానంతో పునర్జన్మ
బిడ్డకు జన్మనిచ్చి...ముగ్గురికి పునర్జన్మ నిచ్చి...,చిరువ్యాపారి అవయవ దానం ఐదుగురి జీవితాల్లో వెలుగు, అవయవ దానంతో అమరత్వం,ఆరుగురి జీవితాల్లో వెలుగులు, తుది శ్వాస విడిచి...మరో ఇద్దరికి ఊపిరి,చనిపోతూ ముగ్గురికి అవయవదానం,ప్రాణదాత...ఇలా తెలంగాణలోని పత్రికల్లో ప్రతీరోజూ అవయవ దానంపై వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు, అవయవ దానంతో అమరత్వం, రోగులకు పునర్జన్మ ఇస్తుందని తెలంగాణ బ్రెయిన్ డెత్ వారి కుటుంబాలు నిరూపించి, తమ వారు బ్రెయిన్ డెత్ అయినా వారి అవయవాలను నలుగురికి దానం చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.బ్రెయిన్ డెత్ అయిన వారి కిడ్నీలు, లివర్, హార్ట్,హార్ట్ వాల్వులు,కళ్లు, లంగ్స్, పాంక్రియాస్ లను సమస్యలున్న రోగులకు ట్రాన్స్ ప్లాంట్ చేస్తున్నారు.

2012లో జీవన్ దాన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 2012వ సంవత్సరంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) జీవన్ దాన్ కార్యక్రమం అమలుకు అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఆ తర్వాత నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 40 ఆసుపత్రులకు జీవన్ దాన్ అవయవ దానానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

తెలంగాణలో 5,541 అవయవాల దానం
తెలంగాణలో జీవన్ దాన్ కార్యక్రమం కింద 5,541 అవయవాలు, టిస్యూలను దానం చేసి, వందలాది మందికి పునర్జన్మ ప్రసాదించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద 1465 మంది కార్డియాక్ డోనర్స్, 550 మందికి ఇతర అవయవాలను ఉచితంగా దానం చేశారు. జీవన్ దాన్ కార్యక్రమం కింద ప్రభుత్వం అవగాహన కార్యక్రమం చేపట్టింది.

ఎక్కువ మందికి అవయవ దానం
2023వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 1150 మంది అవయవదానం చేశారు.బ్రెయిన్ డెత్ అయిన వారు 457 మందికి కిడ్నీలు, 273 మందికి లివర్లు, 30 మందికి హార్ట్, 270 మందికి కార్నియాలు, 118 మందికి లంగ్స్, ఇద్దరికి పాంక్రియాస్ లు దానం చేశారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది అవయవదానం చేశారు.2013-2024వ సంవత్సరం వరకు నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 550 మందికి కిడ్నీలు, లివర్లు, హార్ట్, లంగ్స్, పాంక్రియాస్ లను అవయవ దానం చేశారు.

అవయవదానంలో తెలంగాణ అగ్రస్థానం
2013లో ప్రారంభించిన జీవన్ దాన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1,288లకు పైగా బ్రెయిన్ డెత్ లు జరిగాయి. ఫలితంగా 5,541 అవయవాలను సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేశారు.భారత అవయవ దాన దినోత్సవంలో దేశంలోనే అత్యధికంగా మరణించిన అవయవ దాతలను అందించిన రాష్ట్రంగా తెలంగాణాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచినందుకు గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవన్ దాన్ కార్యక్రమం కింద అవయవాలను దానం చేసిన కుటుంబాలను ప్రభుత్వం సత్కరించింది.

అవయవ దానం చేసిన కుటుంబాలకు సత్కారం
తెలంగాణలో 2023 వ సంవత్సరంలో మిలియన్ జనాభాలో 5.48 శాతం మంది అవయవ దానం చేశారు. 2023లో జాతీయ అవయవదానం సగటు 0.8 శాతం కాగా తెలంగాణ దేశంలోనే అవయవదానంలో అగ్రస్థానంలో ఉంది.జాతీయ అవయవ దాన దినోత్సవం ఆగస్టు 2వతేదీన గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అవయవ దానం చేసిన 143 కుటుంబాలను సన్మానించారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన జీవన్ దాన్ అవయవదాన కార్యక్రమం సాధించిన విజయాలకు ప్రశంసలు లభించాయి. 2013లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అవయవ దానం కార్యక్రమం కింద ‘హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఫ్రేమ్‌వర్క్ అవార్డు-2024’లభించింది.


Tags:    

Similar News