తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు-2024 విడుదల

తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు.11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Update: 2024-09-30 13:49 GMT


తెలంగాణ విద్యాశాఖ ఈ ఏడాది మార్చి 1వతేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది.11,062 టీచర్ పోస్టుల కోసం 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వతేదీ వరకు అభ్యర్థులు పరీక్షలు రాశారు.డీఎస్సీ ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉన్నాయి. మెరిట్ కం రోస్టర్ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులకు పంపిస్తామని అధికారులు చెప్పారు.

డీఎస్పీ ఫలితాలను విడుదల చేసిన సీఎం
డీఎస్సీ ఫలితాలను సోమవారం సచివాలయంలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి విడుదల చేశారు.ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనర్సింహ,కొండా సురేఖ, సలహాదారులు వేంనరేందర్ రెడ్డి, కేశవరావు, విద్యా కమిషన్ కు చెందిన ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ సెలెక్టెడ్ లిస్టు ప్రకారం అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత సాధారణ ర్యాంకింగ్ జాబితా, రిజర్వేషన్ ప్రకారం జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటిస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేషం చెప్పారు. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్‌ ర్యాంకులను వెల్లడించామన్నారు.


Tags:    

Similar News