ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. వారికి నో ఛాన్స్..!
అభ్యర్థుల జాబితాను నటరాజన్ మరికాసేపట్లో ఏసీసీకి సమర్పించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.;
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై తెలంగాణ కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులను ఖారారు చేసింది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. పార్టీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఇందులో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరికి పడితే వారికి టికెట్ ఇచ్చేది లేదని నటరాజన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో పోట చేసిన వారికి, కార్పొరేషన్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకూడదని నిశ్చయించారు. అభ్యర్థుల జాబితాను నటరాజన్ మరికాసేపట్లో ఏసీసీకి సమర్పించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాలుగు స్థానాల టికెట్లలో బీసీ లేదా ఓసీకి ఒకటి, ఎస్సీ లేదా ఎస్టీలకు ఒకటి ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఓసీ నుంచి జెట్టి కుసుమ కుమార్, గాంధీ వన్ ఇన్‌ఛార్జ్ కుమార్ రావు పోటీలు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్, రామచల సిద్దేశ్వర్, ఎస్‌టీ నుంచి శంకర్ నాయక్, నెహ్రూనాయకల్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అని ఏఐసీసీ నిర్ణయించనుంది.
నామినేషన్లు వేయడానికి సోమవారం ఆఖరు తేదీ కావడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ స్పీడు పెంచింది. కాగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 40మంది ఆశావాహులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ లిస్ట్‌ను కాంగ్రెస్ నేతలు షార్ట్‌లిస్ట్ చేశారు. కొందరు పేర్లను సిఫార్సు చేస్తూ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీకి అందించనున్నారు మీనాక్షి. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.