రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ పై మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.

By :  Vanaja
Update: 2024-06-28 16:58 GMT

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ పై మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న ఆయన... రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమేనన్నారు. పాస్ బుక్ ఆధారంగా రూ.2లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం నెలకు రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగి, సంస్థ ఆదాయం బాట పట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్న సీఎం రేవంత్.... వాటి వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News