Ponnam Prabhakar | ‘సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకుండే’

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Update: 2024-12-09 09:04 GMT

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై వాడి వేడిగా చర్చలు జరిగాయి. ఈ అంశంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నం చర్చ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రం వచ్చిన పదేళ్ల వరకు రాష్ట్ర గేయం అనేది లేదని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే రాష్ట్ర గేయాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

‘‘తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అధికారికంగా లేదు. అది ఒక పార్టీకి సంబంధించిన అప్లికెటెడ్ తప్ప రాష్ట్ర అధికారిక విగ్రహం కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణకు స్ఫూర్తి దాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి, కుటుంబానికి పరిమితం కాదు. మేము ఎక్కడ మార్చమని పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా విగ్రహం లేదు. 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లిని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదు. విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌లలో, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలి’’ అని సూచించారు.

‘‘ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం. తెలంగాణ ఏర్పడడానికి సోనియా గాంధీ అకంటిత దీక్ష, కమిట్మెంట్ ప్రధాన కారణం. పక్క రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వారికి ఈ సభ నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. రాజకీయంగా తెలంగాణ అంశంపై 10 సంవత్సరాలు చూశాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదు. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులను ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ కాగానే వారికి పదవులు ఇస్తే వారు అనుకూలంగా ఉంటారేమో.. కానీ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికి దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, నేను ఒక కమిటీ వేసింది.. అందులో ఒక నిర్ణయం తీసుకున్నాం. లోకలిటీ సమస్య ఉంది.. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారం చేస్తాం’’ అని వెల్లడించారు.

‘‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అందరూ ఆమోదించాలి. ఖమ్మం జిల్లా వరదలతో చాలా ప్రాంతాలు మునిగి 10 వేల కోట్ల నష్టం జరిగితే ముష్టి 400 కోట్లు ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా నిధులు తెచ్చుకునే విషయంలో ఉండాలి. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి సేవ చేసుకోవాలి. తెలంగాణ తల్లి రాచరికపు పాలన లేకుండా ఒకవైపు అభయ హస్తం మరోవైపు పచ్చని పాడి పంటలు పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కిరీటాలు లేకుండా గ్రామాల్లో కనిపించే గ్రామ వనితలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉండేలా విగ్రహ ఏర్పాటు ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం వచ్చినప్పుడు హక్కు గా భావించవద్దు. తెలంగాణలో ఆర్టీసీ వాళ్ళు నై చెలేగా బస్ కా పయ్య అని ఆర్టీసీ ఉద్యోగులు.. సింగరేణి ఉద్యోగులు సకల జనులు సమ్మె చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి బంద్ చేస్తే దక్షిణ భారత దేశంలో విద్యుత్ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు.

‘‘ప్రభుత్వం రాగానే ఎన్నో హామీలు అమలు చేశాం. ప్రభుత్వం రాగానే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేశాం. ఆర్టిసీలో మహిళలకు ఉచిత బస్సు ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 కి గ్యాస్ ఇలా ఎన్నో పథకాలు అమలు చేశాం ,ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి. సంవత్సరం పూర్తి చేసుకొనున్నాం. తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించినారు, అనేక మంది కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ని, కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించాం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రాజకీయాలు వేరు తెలంగాణ అభివృద్ది వేరు’’ అని అన్నారు.

‘‘ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. తెలంగాణ బిల్లు పాస్ అయినా వేళ డా..బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వస్తావా చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. అసలు సిసలైన తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దీనిపై కూడా విమర్శలు చేస్తే వారి ఆకాంక్షలు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అందరూ సహకరించాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News