అసదుద్దీన్ అడ్డాలో లేడీ ఆఫీసర్ ఎంట్రీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అడ్డాలో కేంద్ర ఎన్నికల సంఘం లేడీ ఆఫీసర్ ని దించింది. స్నేహ మెహ్రాను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గా నియమించింది.

By :  Vanaja
Update: 2024-04-25 17:29 GMT

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అడ్డాలో కేంద్ర ఎన్నికల సంఘం లేడీ ఆఫీసర్ ని దించింది. 2018 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అధికారిణి స్నేహ మెహ్రాను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) గా నియమించింది. అయితే అంతకంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీస్ పంపింది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను బదిలీ చేయాలని, అలాగే ఆయన స్థానంలో ముగ్గురు IPS అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు IPS అధికారుల జాబితాను కమిషన్‌కు పంపింది. వీరిలో స్నేహ మెహ్రాను ఈసీ హైదరాబాద్ సౌత్ డీసీపీగా ఎంపిక చేసింది. ప్రభుత్వం ఆమెని తక్షణమే పోస్టు బాధ్యతలు స్వీకరించి, కన్ఫర్మేషన్ రిపోర్ట్ పంపాలని సూచించింది.

స్నేహా మెహ్రా, హైదరాబాద్‌లో సెన్సిటివ్ జోన్‌గా ఉన్న ప్రాంతానికి DCP గా పోస్టింగ్ ఇవ్వబడిన మొదటి మహిళా IPS ఆఫీసర్ కావడం విశేషం. గత డీసీపీ సాయి చైతన్య AIMIM పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు అతనిపై ఫిర్యాదులు లేవనెత్తారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం అతనిపై ఫోకస్ పెట్టింది.

గత కొన్నేళ్లుగా సాయి చైతన్య సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ ల బదిలీలు జరిగినప్పటికీ సాయి చైతన్య అదే స్థానంలోనే ఉండటంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు, అతనిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News