ఒక్క ఓటు వేస్తే ముగ్గురు సేవ చేస్తారు -రేవంత్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ గుర్మిట్కల్ లో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పటు చేసింది. ఈ ప్రచార సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

By :  Vanaja
Update: 2024-04-29 09:46 GMT

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ గుర్మిట్కల్ లో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పటు చేసింది. ఈ ప్రచార సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభకి హాజరైన గుర్మిట్కల్ ఓటర్లని, కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.

ఒక్క ఓటు వేస్తే ముగ్గురు సేవ చేస్తారు -రేవంత్

సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...

గుర్మిట్కల్ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా మల్లికార్జున ఖర్గే కొనసాగారు.1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.

మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నాం. మోదీ పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు..

నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారు. 40కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ... ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు. కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే... మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి. ఆయన కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు.

నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారు. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండి. కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే... ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ను ఇక్కడ లక్ష మెజారిటీతో గెలిపించండి అని రేవంత్ రెడ్డి ఓటర్లను అభ్యర్ధించారు.

Tags:    

Similar News