‘సీఎం రేవంత్‌కు ప్రభుత్వాన్ని నడుపొడొస్తలేదు’.. కేసీఆర్ విమర్శనాస్త్రాలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్‌కు ప్రభుత్వాన్ని నడుపుడు వస్తనే లేదని ఆరోపించారు.

Update: 2024-10-27 09:18 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్‌కు ప్రభుత్వాన్ని నడుపుడు వస్తనే లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆరు హామీలు ప్రకటించిన సీఎం, వంద రోజుల్లో వాటన్నింటినీ అమలు చేస్తామంటూ ఏడో హామీని కూడా ఇచ్చారని, కానీ పది నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు హామీల ఊసు లేదని విమర్శించారు. పైగా ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి ఇప్పుడు మూసీ ప్రక్షాళకు పెద్దపీట వేస్తున్నారని, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ ప్రక్షాలనకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

రేవంత్ పాలనలో దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పోలీసులను పోలీసులే కొడుతున్నారని, ఈ అంశంలో మాత్రం రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారంటూ చురకలంటించారు కేటీఆర్. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తమని గప్పాలు చెప్పుకుంటున్నారని, అందుకోసం కేవలం రూ.1100 కోట్లతో గోదావరి నీళ్లను ఇటు మళ్లిస్తే సరిపోతుంది కదా అని అన్నారు. దీనిని బట్టే అవినీతి చేయడానికే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అంటున్నారని, తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకోవడానికి మూసీ ప్రాజెక్ట్ తెస్తోందనం విమర్శలు వెల్లువెత్తించారు.

రేవంత్ మాటే కదా నేనంది..

‘‘వందరోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు, గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారు. రెవంత్ అన్న మాటే నేనంటే వాళ్ల ప్రభుత్వం నాపై కేసు పెట్టింది. మా పార్టీ మూసీకి వ్యతిరేకంగా కాదు. కానీ మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అవినీతి చేస్తామంటే ఊరుకోం. హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ పూర్తయి అనుమతులు ఉండి పన్నులు కడుతున్నవారి ఇళ్లను కూలుస్తున్నారు. పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేవరకు పేదల తరపున కాంగ్రెస్ వెంటపడపతాం. హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని అన్నారు కేటీఆర్.

ఆ కక్షతోనే ఈ విధ్వంసం

‘‘హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న కోపంతోనే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆ కక్షతోనే పేదల కూలుస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. కూలగొట్టిన పేదల స్థలాల్లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ కట్టాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు తాగునీటి కోసం కష్టాలు లేకుండా చేశాం. హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేలా అన్ని రంగాల్లో అభివృద్ధిని చేపట్టాం. హైదరాబాద్ నగర మురికినీటి పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. మూసీలోకి మురికినీరు రాకుండా చేయడం కోసం ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టాం. నగరమంతటా దాదాపు 32 ఎన్‌టీపీలు నిర్మించాం. రూ.4వేల కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం ఎస్‌టీపీల నిర్మాణ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది’’ అని వివరించారు కేటీఆర్.

Tags:    

Similar News