వలస ఎమ్మెల్యేలకు షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వలస ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారు.

By :  Vanaja
Update: 2024-06-28 16:40 GMT

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వలస ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారు. త్వరలో రెండవ క్యాబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో రేవంత్ కీలక ప్రకటన చేశారు. దీంతో ఒకవేళ బీఆర్ఎస్ నుంచి మంత్రి పదవులు ఆశించి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే వారికి ఆశాభంగం కలుగక మానదు. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళకే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం తేల్చి చెప్పారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తు జరుగుతుందన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలి అనే అంశాలపై అధిష్టానందే కీలక నిర్ణయం అన్నారు. పోటీలో ఎవరైనా ఉండొచ్చన్న రేవంత్... సామాజిక న్యాయం మాత్రం తప్పనిసరిగా ఉంటుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ ఎవరినైనా, దేనికైనా ఎంపిక చేయొచ్చన్నారు.

ఫిరాయింపులకు తెలంగాణ ఒక్కటే ప్రత్యేకం కాదన్న ఆయన... కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో కూడా ఎమ్మెల్యేలు ఫిరాయించారని గుర్తు చేశారు. నలుగురు రాజ్యసభ ఎంపీలతో బీఆర్ఎస్ ఏకంగా టీడీపీనే విలీనం చేసుకుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్, క్యాబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకే సారి ఫైనల్ అవుతాయని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ గా తాను రెండు ఎన్నికలు పూర్తి చేశానని, జూలై 7తో మూడేళ్లు పూర్తి కానున్నాయని తెలిపారు.

Tags:    

Similar News