Lagacharla | లగచర్లలో వెనక్కి తగ్గిన రేవంత్ ప్రభుత్వం..

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-29 08:42 GMT

వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా సిటీ(Pharma City) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ నిర్మించేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని ప్రకటించిన తర్వాత కూడా లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. లగచర్లలో చేపట్టిన భూసేకరణను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది కాంగ్రెస్ సర్కార్. అయితే ఫార్మా విలేజ్‌లకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు 1న ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వెల్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండటం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు ఇతర అధికారులు లగచర్ల, పోలేపల్లికి చేరుకున్నారు. కాగా అక్కడ వారికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అధికారులక వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు నినాదాలు చేశారు. అంతేకాకుండా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్, సురేష్ పదుల సంఖ్యలో ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ కూడా సురేష్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగానే కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో వెలల్లడైంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం డీజీపీ ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సురేష్‌పై ఇప్పటికే అత్యాచారం సహా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సురేష్‌పై ఉన్న కేసులను తొలగించడం కోసం పట్నం రేందర్ కీలకంగా వ్యవహరించారిన కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. పట్నం రేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే లగచర్ల సురేష్ గా పాపులరైన బోగమోని సురేష్ మంగళవారం సాయంత్రం కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. కొడంగల్(Kodangal) నియోజకవర్గం లగచర్ల(Lagacharla) గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద జరిగిన దాడికి సురేష్ సూత్రదారిగా పోలీసులు చెబుతున్నారు. అందుకనే దాడిఘటనలో బోగమోని(Bogamoni Suresh)ని ఏ2గా పోలీసులు ప్రస్తావించారు. ఎప్పుడైతే సురేష్ కోర్టులో లొంగిపోయాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ నిమ్మితం తమకు అప్పగించాలని కోర్టులో పిటీషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం ఏ2కి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఆ సమయంలోనే కొడంగల్‌లో నిర్మించేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మరింత దుమారం రేపింది. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మీ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌లోనే ఫార్మా విలేజ్ కోసమే భూసేకరణ చేస్తున్నట్లు స్పష్టంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారం చల్లారకముందే మరోవైపు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. దీంతో ఈ ఫ్యాక్టరీలు రేవంత్‌కు వరుస ఎదురు దెబ్బలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే లగచర్లలో చేపట్టిన ప్రాజెక్ట్‌ పనులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Tags:    

Similar News