కిడ్నీ రాకెట్ కేసులో మరో 9మంది అరెస్ట్..
అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.;
అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు సైతం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమాత్రం ఆధారం లభించినా ఆ దిశగా దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఈకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. తాజాగా ఈ కేసు విచారణలో వచ్చిన పురోగతికి సంబంధించి రాచకొండ సీపీ శ్రీధర్ బాబు కీలక విషయాలు పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 15మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. తాజాగా తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ‘‘సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో 9మందిని అరెస్ట్ చేసాం. మరికొంత మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం. కిడ్నీ ఆపరేషన్‌లు అలకనంద ఆసుపత్రిలోనే చేశారు. నశ్రీమ్ భాను, ఫిర్ధోస్ డోనర్స్..రాజశేఖర్, ప్రభ ఇద్దరు రెసివర్స్ ఉన్నారు. ఆసుపత్రి తనిఖీ చేసిన సమయంలో నలుగురిని గుర్తించాం’’ అని చెప్పారు.
‘‘డాక్టర్ సుమంత్ అలకనంద ఆసుపత్రి పెట్టారు. డాక్టర్ అవినాష్ సర్జరీ చేశారు.. బయట నుండి డాక్టర్స్ ని తెచ్చి ఆపరేషన్స్ చేస్తున్నారు. అవినాష్.. జనతా,అరుణ ఆసుపత్రిలో గతంలో చేశారు. 2022లో అలకనంద ఆసుపత్రి పెట్టారు. డాక్టర్స్ అవినాష్, సుమంత్ లు.. ప్రవీణ్ , మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ రవీందర్, హరీష్ సాయి లు 9మందిని అరెస్ట్ చేసాం. ఇతర దేశాల్లో మెడిసిన్ చేశారు.. వైద్య వృత్తిలో అనుభవం లేకపోవడం ఈ తరహా దందాకు తెరలేపారు. అలకనంద ఆసుపత్రిని ఎంచుకొని కిడ్నీ సర్జరీలు చేస్తూ డబ్బులు సంపాదన కోసం వైద్యులు అవినాష్, సుమంత్ చేశారు. ఇప్పటివరకు కిడ్నీ కేసులు ఎన్ని అయ్యాయి, ఎంతమంది ఉన్నారనేది దర్యాప్తు చేస్తున్నాము’’ అని తెలిపారు.
‘‘నిందితుడు పవన్ కిడ్నీ సర్జరీలో కీలకంగా వ్యవహరించాడు. డాక్టర్స్, డోనర్స్ లో కీలకంగా వ్యవరించాడు. ఇప్పటివరకు పరారీలో ఆరుగురు వ్యక్తులు. ఇతర రాష్ట్రాల డాక్టర్లు కూడా ఉన్నారు త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం. ప్రదీప్ అని నిందితుడు ఇతర రాష్ట్రాల వ్యక్తులను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయిస్తున్నాడు’’ అని ఆయన వెల్లడించారు.