పహల్గాం ఉగ్ర దాడిపై జుమా నమాజ్ లో నిరసన
పహల్గాం బాధితులకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.ముస్లింలు జుమా నమాజ్ లో నిరసన తెలపనున్నారు.;
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిపై హైదరాబాద్ నగరంలో శుక్రవారం సందర్భంగా జరగనున్న జుమా నమాజ్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని హైదరాబాద్ ఎంపీ,ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడి ఘటనలో బాధితులకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లింలంతా నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపడతారని చెప్పారు.ముస్లింలు దుఃఖాన్ని, ఉగ్రవాద దాడికి వ్యతిరేకతను సూచిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరిస్తారని ఎంపీ వివరించారు.
దేశ ఐక్యతను బలహీన పర్చబోం
पहलगाम के आतंकी हमले के सिलसिले में मेरी अपील: कल जब आप नमाज़-ए-जुम्मा पढ़ने जायेंगे तो आपने बांह पर काली पट्टी बांधकर जाएँ। इस से हम यह पैग़ाम भेजेंगे की हम भारतीय विदेशी ताक़तों को भारत के अमन और इत्तेहाद को को कमजोर करने नहीं देंगे। इस हमले की वजह से शर-परस्तों को हमारे… pic.twitter.com/r6uYdzQiOf
— Asaduddin Owaisi (@asadowaisi) April 24, 2025
మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ గడ్డి మైదానంలో పర్యాటకులు పోనీ రైడ్, పిక్నిక్ లతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి యూఏఈ, నేపాల్ దేశాలకు చెందిన ఇద్దరితోపాటు 26 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డిమాండ్ చేశారు.