Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు.. ధర్నా చేసినందుకే..

ధర్నా చేసిన 15 రోజుల తర్వాత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌కు పోలీసుల నోటీసులు.

Update: 2024-11-24 09:41 GMT

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నవంబర్ 9వ తేదీన దళితబంధు(Dalitha Bandhu) అంశంపై ఆయన హుజూరాబాద్‌లో ధర్నీ చేశారు. దానికి సంబంధించే పోలీసులు(Police) ఈరోజు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కౌశిక్ రెడ్డి ధర్నా చేశారని పేర్కొంటూ కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్(BRS) నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను సెక్షన్స్ 35(3) బీఎన్ఎస్ చట్టం కింద నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన పోలీసు స్టేషన్‌కు రావాలని కూడా సూచించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు రెండో విడత నగదు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి ధర్నా చేశారు. ఆ సమయంలో ఇది రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది. అతనిని అదుపులోకి తీసుకోవాడానికి పోలీసులు బలప్రయోగం చేయడం ఆయన స్పృహ తప్పారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అదే అంశానికి సంబంధించి పోలీసులు దాదాపు 15 రోజుల తర్వాత నోటీసులు జారీ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

నవంబర్ 9న ఏం జరిగిందంటే..

దళితబంధు రెండో విడత నగదు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి భారీ ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నా విరమించుకోవాలని తెలిపారు. దాంతో అది కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే దళితబంధు రెండో విడత డబ్బులు అందని వారంతా తన ఇంటి దగ్గరకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఆయన ఇంటికి అధిక మొత్తంలో లబ్ధిదారులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే దళితబంధు రెండో విడత డబ్బుల కోసం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర చేపట్టనున్న ధర్నాలో పాల్గొనాలని లబ్ధిదారులు ఎమ్మెల్యేను కోరారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం ధర్నాలో కౌశిక్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం అక్కడి పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన అస్వస్థతకి గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అప్పట్లో కేటీఆర్, హరీష్‌ రావులు తీవ్రంగా ఖండించారు.

కౌశిక్ అంటే భయమా..: హరీష్, కేటీఆర్

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కౌశిక్ రెడ్డిపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. “కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి” అని కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు.

Tags:    

Similar News