పోలీసు కస్టడీలో నాగాల్ ‘బీర్’ జంట

మద్యం మత్తులో రచ్చ చేసిన యువతిని, యువకుడిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్తుగూడలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఓ యువకుడు, యువతి హల్ చల్ చేశారు.

By :  Vanaja
Update: 2024-05-25 10:53 GMT

మద్యం మత్తులో రచ్చ చేసిన యువతిని, యువకుడిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్తుగూడలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఓ యువకుడు, యువతి హల్ చల్ చేశారు. రోడ్డు పక్కనే కారు ఆపి సిగరెట్ కాలుస్తూ బీర్ తాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అటుగా వెళ్తున్న మార్నింగ్ వాకర్స్ బహిరంగంగా మద్యం సేవించడంపై ప్రశ్నించగా వారితో గొడవకి దిగారు.

వాకింగ్ చేస్తోన్న సీనియర్ సిటిజన్స్ న్యూసెన్స్ చేయకుండా వెళ్లిపొమ్మని చెప్పినా వినకుండా వారిని ఈ జంట దుర్భషలాడటం మొదలుపెట్టారు. ఘటనని వీడియో తీస్తున్న మరో వ్యక్తిపైనా వారు గొడవపడ్డారు. వీడియో తీయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్నవారంతా చెబుతున్నా వినకుండా యువతి, యువకుడు రివర్స్ అవడంతో వాకర్స్ బలవంతంగా వారిని కారులో ఎక్కించి పంపించేశారు. ఆ ఇద్దరి తీరుపై సీరియస్ అయిన సిటిజన్స్ నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో క్లిప్ ని కూడా పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది.

ఘటనపై కంప్లైంట్ అందుకున్న నాగోల్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. యువకుడు పీర్జాదిగూడకి చెందిన అలెక్సా (25 ) అని, తార్నాక కి చెందిన యువతి గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే అని పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. అలెక్స్ తోపాటు యువతిపై IPC 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు యువతికి 41 CRPC నోటీసు ఇచ్చి పంపించేసినట్లు సమాచారం.

కాగా, ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్ల నుండి కూడా డిమాండ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరినీ అరెస్టు చేసినట్టు నాగోల్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. మందు తాగుతూ, మద్యం సేవిస్తూ వాకింగ్ కి వచ్చిన సీనియర్ సిటిజన్స్ ని ఇబ్బంది పెట్టిన కారణంగా నాగోల్ పోలీసులు ఒక యువకుడిని, యువతిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందంటూ పోలీసులు వెల్లడించారు.



 


Tags:    

Similar News