SLBC సొరంగంలో ఫెడరల్ బృందం తీసిన ఫోటోలు

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిపోయి ఆరు రోజులు గడిచింది.ఈ టన్నెల్ లోపల ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం సందర్శించి తీసిన ఫొటొలను మీ కందిస్తున్నాం.;

By :  68
Update: 2025-02-27 05:18 GMT

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం (Tunnel) కూలిపోయి గురువారం నాటికి ఆరు రోజులు గడిచింది. ఈ టన్నెల్ లోపల 8 మంది చిక్కుకుపోయారు. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తదితర పది విభాగాల ప్రత్యేక బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా గురువారం నాటికి ఒక కొలిక్కి రాలేదు. బురద, నీరు నిండిన టన్నెల్ లోపలకు ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసింది. ఫెడరల్ అందిస్తున్న ఎక్స్ క్లూజివ్ చిత్రాలు చూద్దాం రండి. గత శనివారం నాడు ఈ టనెల్ కప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. ఇందులో చిక్కుకు పోయిన వారితో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు ఎలా ఉన్నారు, చనిపోయారా, మృత్యువుతో పోరాడుతున్నారా అనేది కూడా తెలియడంలేదు. 48 గంటల్లో వాళ్ల దగ్గరికి చేరుకునేందుకు ప్రభుత్వం  డైడ్ లైన్ పెట్టుకుంది. ఏమవుతుందో చూడాలి.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC ) సొరంగంలో ఏం జరుగుతున్న ది? ప్రస్థుతం లోపల ఎలా ఉంది అనేది పరిశీలించేందుకు ‘ఫెడరల్ తెలంగాణ’ బృందం టనెల్  చాలా దూరం ప్రయాణించింది.  ఫెడరల్ తెలంగాణ ప్రతినిధులు చాలా దూరం సొరంగంలో నడుచుకుంటూ వెళ్లి అక్కడజరుగుతున్న సహాయక చర్యలను పరిశీలాించారు.  అక్కడి నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీకు అందిస్తున్నాం.







 








 








టనెల్ నుంచి రిపోర్టు చేస్తున్న ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి సలీమ్ షేక్


 


 


 


 


 


 


 


 


 


 


 



Tags:    

Similar News