తెలంగాణలో లోకాయుక్త పెండింగ్ కేసుల పరిష్కారంపై కొత్త ఆశలు
తెలంగాణలో లోకాయుక్త, ఉప లోకాయుక్తలు పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పెండింగ్ కేసుల పరిష్కారంపై కొత్త ఆశలు ఏర్పడ్డాయి.;
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రజలు లోకాయుక్తకు ఫిర్యాదులు సమర్పించారు. లోకాయుక్తలో పెండింగులో ఉన్న కేసులు కొత్త లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకంతో పరిష్కారమవుతాయని ఫిర్యాదు దారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి వీలుగా లోకాయుక్తలో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు పెండింగ్ కేసుల విచారణను లోకాయుక్త, ఉప లోకాయుక్తలు వేగిరం చేయాలని ఫిర్యాదు దారులు కోరుతున్నారు.
నాలుగు నెలలుగా లోకాయుక్త ఖాళీ
గవర్నర్ ను కలిసిన లోకాయుక్త, ఉపలోకాయుక్తలు
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం వీరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం రేవంత్ రెడ్డిని లోకాయుక్త, ఉపలోకాయుక్తలు కలిశారు. లోకాయుక్త, ఉప లోకాయుక్తలను సోమవారం తెలంగాణ డీజీపీ జితేందర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.