ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది.;

Update: 2025-02-24 10:10 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఐదు చొప్పున ఖాళీలున్నాయి. మొత్తం రెండు రాష్ట్రాల్లో 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. ఈ క్రమంలోనే ఈ ఖాళీల భర్తీ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం మార్చి 29కి పూర్తి కానుంది. అదే విధంగా ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పీ అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావుల పదవీకాలం ముగియనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్

మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

మార్చి 11న నామినేషన్ల పరిశీలన

మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

మార్చి 20 సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

Tags:    

Similar News