టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గా నంగి దేవేందర్ రెడ్డి

టీపీసీసీ అంతర్జాతీయ వ్యవహారాల కోఆర్డినేటర్‌గా ఎన్నారై నంగి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు.

By :  Vanaja
Update: 2024-07-29 08:06 GMT

టీపీసీసీ అంతర్జాతీయ వ్యవహారాల కోఆర్డినేటర్‌గా ఎన్నారై నంగి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బీఎం వినోద్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దేవేందర్ రెడ్డి నియామకం ఆదివారం నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు నంగి దేవేందర్ రెడ్డి. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి ధన్యవాదాలు తెలిపారు. నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బి.మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ లు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారం, విద్య కోసం వందలకు పైగా దేశాలకు వలస వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను జన్మభూమి తెలంగాణతో అనుసంధానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున కృషి చేస్తానని అన్నారు. గల్ఫ్ వర్కర్ల సమస్యల మీద దృష్టి పెడతానని నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.

నంగి దేవేందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందినవారు. హోటల్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన ర్యాడ్ బ్లాక్ ఈఎంఆర్ ట్రేడింగ్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆయనని టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గా నియమించింది.

గల్ఫ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్...

తెలుగు రాష్ట్రాలకి చెందిన అనేకమంది ఎంతోమంది పేదలు గల్ఫ్ దేశాలకి వెళ్లి డబ్బు సంపాదించాలని ఆశ పడుతుంటారు. అక్కడికి వెళ్తే తమ సమస్యలు తీరతాయని, ఆర్ధికంగా ఎదగొచ్చని భావిస్తుంటారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక ఏజెంట్ల వద్దకి వెళతారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. బాధితులు అక్కడికి వెళ్ళాక నానా యాతనలు పడుతున్నారు. గొడ్డు చాకిరీ చేస్తూ, తిండి తిప్పలతో నరకం అనుభవిస్తున్నారు. ఇటీవల అలాంటి బాధితులు అక్కడ వారు పడుతున్న ఇబ్బందులను సెల్ఫీ వీడియోలు తీసి, మమ్మల్ని ఈ కూపం నుండి తీసుకెళ్లండి అంటూ వేడుకుంటున్నారు.

ఇలా అక్రమ రవాణాకు గురై, గల్ఫ్ కంట్రీస్ లో ఇబ్బందులకు గురవుతున్న టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గా నంగి దేవేందర్ రెడ్డివారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందుకే గల్ఫ్ దేశాలతో అనుబంధం ఉన్న నంగి దేవేందర్ రెడ్డిని ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గా నియమించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా గల్ఫ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయనని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News