రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్ ఖరారు..

రూ.25వేల పూచీ కత్తు, ప్రతి సోమ, మంగళవారం విచారణకు రావాలన్న షరతులతో బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం.;

Update: 2025-03-17 11:43 GMT

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీ కత్తు, ప్రతి సోమ, మంగళవారం విచారణకు రావాలన్న షరతులతో బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా తిడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో సీఎంను తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్రకార్యదర్శి కైలాష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జర్నలిస్ట్ రేవతి, తన్వీ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వారికి రిమాండ్ విధించిన కోర్టు.. సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

Tags:    

Similar News