కొండా సురేఖపై పరువు నష్టం దావా.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న నాగ్

మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సమంత, తన కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన నిరాధారా వ్యాఖ్యలకు గానూ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున.. కోర్టును కోరారు.

Update: 2024-10-03 12:15 GMT

మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సమంత, తన కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన నిరాధారా వ్యాఖ్యలకు గానూ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున.. కోర్టును కోరారు. ఆమె తన కుటుంబ పరువును దెబ్బతీసేలా మాట్లాడారాని, అందుకు గానూ తగిన చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున.. నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని బజారుకీడ్చటం ఏమాత్రం సబబని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. మరెవరూ తమ స్వార్థ రాజకీయాల కోసం మరో కుటుంబాన్ని రోడ్డుకీడ్చే ధర్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌ను ఇంకా స్వీకరించాల్సి ఉంది. అయితే రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమంత, అక్కినేని కుటుంబం, కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గౌరపప్రదమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా అని సినీ పరిశ్రమ పెద్దలతో పాటు రాజకీయ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను ఎమోషన్‌లో అలా మాట్లాడేశానని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని కొండా సురేఖ చెప్పినా.. ఆమె వ్యాఖ్యలు అంటించిన వివాద జ్వాలలు ఏమాత్రం చల్లబడటం లేదు. ఈ నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరుగా సినీ, రాజకీయ ప్రముఖలు కొండా సురేఖపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

నాగ్, సమంత ఏమన్నారంటే..

సురేఖ ఆరోపణలపై నాగార్జున, సమంత స్పందించారు. రాజకీయంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవద్దని నాగార్జున మంత్రిని ఎక్స్ వేదికగా కోరారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని అభ్యర్ధించారు. బాధ్యత కలిగిన మంత్ర హోదాలో ఉండి తమ కుటుంబం విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇక సమంత ఎక్స్ వేదికగా స్పందించి విడాకులు తన వ్యక్తిగతమని చెప్పి ఊహాగానాలను మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి చాలా బలం కావాలని చెప్పారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

వదిలేయమన్న టీపీసీసీ చీఫ్

‘‘సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదాన్ని ఇక ముగించండి. సినిమా పెద్దలందరికి నా విన్నపం.. సినీ ప్రముఖుల మనసు నొచ్చుకున్నది. మంత్రి తన వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి. ఇరు వైపులా మహిళలు ఉన్నారు.. కావునా ఈ విషయాన్ని ఇంతటితో వదలండి. మహిళల మనోభావాలను కించపరచాలనేది ఆమె ఉద్దేశం కాదు. కొండా సురేఖ తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో సమంత హిరోయిన్‌గా ఎదిగిన తీరు అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు తనకు ఆదర్శం అని కూడా వివరించారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి’’ అని మహేష్ కుమార్ గౌడ్ తన వీడియోలో వివరించారు.

నాగార్జున వెనక బీఆర్ఎస్ ఉందా..

సమంత, అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ బుధవారం సాయంత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సమంత, అక్కినేని ఫ్యామిలీ మండిపడతారని అంతా అనుకున్నారు. కానీ వారు మాత్రం చాలా కూల్‌గా జస్ట్ ఎక్స్(ట్వీట్స్)తోనే స్పందించి సైలెంట్ అయిపోయారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం, వాటిని ఉపసంహరించుకోవడం, సమంతకు క్షమాపణలు చెప్పడం అంతా అయిపోయిన తర్వాత నాగార్జున ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరువు నష్టం దావా వేసేలా నాగార్జునను.. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారని, అందుకనే ఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచిన తర్వాత ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న ప్రచారం కూడా సాగుతోంది. మరో పక్క మాత్రం అదేమీ లేదని, కుటుంబీకులతో ఒకసారి ఈ విషయంపై చర్చించి, వారి సమ్మతి తీసుకున్న తర్వాత నాగార్జున లీగల్‌గా వెళ్లాలని డిసైడ్ అయ్యారని, అందుకే కాస్త ఆలస్యం అయిందన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా నాగార్జున పరువు నష్టం దావా వేయడం మంత్రి కొండా సురేఖకు పదవీ గండం తెచ్చిపెట్టడం పక్కా అని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ అంశం రానురాను ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News