న్యూఇయర్ వేడుకలు.. భారీగా డ్రంక్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను హైదరాబాద్ యువత మస్త్‌గా జరుపుకోంది.;

Update: 2025-01-01 07:36 GMT

నూతన సంవత్సర వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను హైదరాబాద్ యువత మస్త్‌గా జరుపుకోంది. అంతా ఏకమై నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు పెట్టి డ్యాన్స్‌లు కూడా చేశారు. చిందులు విందులతో న్యూఇయర్ సందడిసందడిగా సాగింది. కాగా ఈ క్రమంలో డ్రంక్ డ్రైవ్ కేసులు కూడా భారీగా నమోదైనట్లు పోలీసు శాఖ తెలిపారు. ఎన్ని హెచ్చరికలు, సూచనలు చేసినా యువత మాత్రం మద్యం సేవించి వాహనాలు నడిపారని, వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే పలు అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో పలు ప్రమాదాలు జరిగి మరణాలు కూడా సంభవించాయని చెప్పారు. న్యూఇయర్‌ను పురస్కరించుకుని వేల మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ చిక్కారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా డిసెంబర్ 31 ఒక్క రాత్రి 11,84 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల క్రమంలో పలు ప్రాంతాల్లో మందుబాబులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయని పోలీసు అధికారులు చెప్పారు.

డ్రంక్ డ్రైవ్ కేసుల వివరాలిలా..

న్యూఇయర్ సందర్భంగా నమోదైన డ్రంక్ డ్రైవ్‌ల కేసులు జోన్‌ల వారీగా చూసుకుంటే.. ఈస్ట్ జోన్-236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా పలు ప్రాంతాల్లో న్యూఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించడంతో పలువురు బైకులు వదిలి కూడా పారిపోయిన ఘటనలు జరిగాయని పోలీసులు వివరించారు. యువత ఎప్పుడూ కూడా డ్రంగ్ డ్రైవ్‌ను ప్రోత్సహించకూడదని, దీని వల్ల తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. న్యూఇయర్ వేడుకల సమయంలో మద్యం మంచినీళ్లలా మారిపోయింది.

ఏరులై పారిన మద్యం

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచే తెలంగాణ వ్యాప్తంగా మాంసం, మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబరు 31న భారీ అమ్మకాలు నమోదయ్యాయి. చివరి రోజున ఏకంగా రూ.8 కోట్ల 10 లక్షల విలువగల విక్ర యాలు జరగడం గమనార్హం. 2024 ముగింపు సందర్భంగా చివరి మూడు రోజుల్లో ఏకంగా రూ.11.26 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోద య్యాయి. గతేడాదితో పోల్చితే మద్యం అమ్మకాలు పెరిగాయి. 2023 డిసెంబరు 31న రూ.5 కోట్ల 69 లక్షల విలువగల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31ని పురస్కరించుకొని ఒక్క మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే రూ. 60 లక్షల విలువ గల చికెన్‌ అమ్మకాలు జరిగాయి.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు. దీంతో ట్యాంక్ బండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే వారిని మాత్రమే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు అనుమతించునున్నారు.

Tags:    

Similar News