కవితకి మద్దతుగా హరీష్ రావు

ఎమ్మెల్సీ కవితకి ఆమె మేనబావ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతుగా నిలిచారు.

By :  Vanaja
Update: 2024-08-29 12:18 GMT

ఎమ్మెల్సీ కవితకి ఆమె మేనబావ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతుగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం అని మండిపడ్డారు. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయి.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా...? అని నిలదీశారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది.. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా...? అని హరీష్ రావు ప్రశ్నించారు.

ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పి.ఏ ల పేరు మీద రేవంత్ భూములు కొంటున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9 లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారన్నారు. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895 లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గింది., ఆయనే దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారన్నారు హరీష్ రావు. మోడీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారని విమర్శించారు. రుణమాఫీపై మేము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండడమెందుకు అని నిలదీశారు. ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు.. అది మేము బాధ్యతగా నిర్వర్తిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

ఇక కవిత అరెస్ట్ రోజు నుంచి విడుదల వరకు కేటీఆర్ తో పాటు ఆమెకి మద్దతుగా నిలిచారు హరీష్ రావు. ఆమెతో ములాఖత్ అయ్యేందుకు అనేకమార్లు కేటీఆర్ తో కలిసి తీహార్ జైలుకి వెళ్లారు. న్యాయపోరాటంలోనూ వారికి అండగా నిలబడ్డారు. సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కేటీఆర్ తోపాటు ముందురోజే ఢిల్లీకి వెళ్లారు. ఆమె జైలు నుంచి విడుదలయ్యే సమయంలోను వెంటే ఉన్నారు. తాజాగా కవిత బెయిల్ పిటిషన్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News